Viral : కళ్ల ముందు ప్రమాదం జరిగినా.. కనీస మానవత్వం చూపని రోజులు ఇవీ. మనవాళ్లు కాకపోతే.. ఎంత పెద్ద ప్రమాదమైనా మనకు సంబంధం లేదు అన్నట్లుగా పక్కనుంచి వెళ్లిపోయే మనుషులు నేటి తరం. ఈలాంటి సమాజంలో ఉన్న ఇద్దరు వృద్ధులు తమ ప్రాణాలకు తెగించారు. వందల మంది ప్రాణాలను ఓ పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు ఓ వృద్ధ దంపతులు. రైలు ప్రమాదాన్ని తప్పించారు.
చెన్నై రైలుకు తప్పిన ప్రమాదం..
చెన్నై – భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఘాట్ రోడ్డు నుంచి ఫ్లైవుడ్ లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదానికి గురైంది. పైనుంచి కింద ఉన్న రైల్వే ట్రాక్‌పై పడింది. దీనిని అక్కడే ఉన్న వృద్ధ దంపతులు గమనించారు. ఆ ట్రాక్‌పై కాసేపట్లో ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుందని తెలుసుకున్నారు. రైలు వస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని ఊహించారు. వెంటనే పట్టాల వెంట పరిగెత్తారు. రైలు ఢీకొంటే తమ ప్రాణాలు పోతాయని తెలిసినా.. లెక్క చేయలేదు.
ఎర్ర క్లాత్ ఊపుతూ..
ట్రాక్‌పై ఎర్రని గుడ్డ పట్టుకుని ఊపుతూ వేగంగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురెళ్లారు. ఇంతలో రైలు దగ్గరకురానే వచ్చింది. ఎదురుగా వస్తున్న వృద్ధ దంపతులను గమనించిన లోకోపైలెట్ రైలును స్లో చేశాడు. ఇంతలో వారి చేతిలో ఎర్రని క్లాత్ ఉండడంతో ముందు ఏదో ప్రమాదం ఉందని గమనించాడు. వెంటనే రైలును ఆపేశాడు. అప్పటికే రైలు లారీ పడిన ప్రదేశానికి చేరుకుంది. దీంతో భారీ ప్రమాదం నుంచి రైలు ప్రయాణికులను కాపాడిన వృద్ధ దంపతులను లోకోపైలెట్ అభినందించారు. అనంతరం సమీపంలోని రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వగా వారు సిబ్బందిని పంపించి ట్రాక్‌పై ఉన్న లారీని తొలగించారు. తర్వాత రైలు వెళ్లిపోయింది.