IND vs ENG 4th Test : భయపెట్టిన బషీర్.. ఇండియా ఐదు వికెట్లు డౌన్.. రాంచీ లో పరిస్థితి ఏంటంటే

ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసిన ఇండియా.. విజయానికి ఇంకా 59 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో గిల్(23), ధృవ్(9) ఉన్నారు.

Written By: NARESH, Updated On : February 26, 2024 12:56 pm
Follow us on

IND vs ENG 4th Test : ధోని ఇలాఖాలో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో సోమవారం ఉదయం సెషన్ లో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికైతే భారత జట్టుకు పెద్ద ప్రమాదం లేకపోయినప్పటికీ.. మైదానంలో బంతి టర్న్ అవుతున్న విధానం చూస్తే ఏదైనా జరగొచ్చు అనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లాండ్ జట్టు విధించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని చేదించేందుకు భారత జట్టు.. ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 24, యువ సంచలనం జైస్వాల్ 16 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

సోమవారం ఉదయం 40 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా రోహిత్ ఎడా పెడా ఫోర్లు బాదాడు. 5 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక ఇండియా గెలుపు లాంఛనమే అనుకుంటున్న క్రమంలో జట్టు స్కోరు 84 పరుగుల వద్ద ఉన్నప్పుడు యశస్వి జైస్వాల్(37) రూట్ బౌలింగ్లో అండర్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 84 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. జైస్వాల్ ఔట్ అయిన తర్వాత గిల్ క్రీజ్ లోకి వచ్చాడు. రోహిత్, గిల్ తదుపరి లాంఛనం పూర్తి చేస్తారు అనుకుంటున్న క్రమంలో..రోహిత్(55) హార్ట్ లీ బౌలింగ్ లో కీపర్ స్టోక్స్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 99 పరుగుల వద్ద ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. రోహిత్ అవుట్ అయిన తర్వాత రజత్(0) పాటిదార్ క్రీజ్ లోకి వచ్చాడు. బషీర్ బౌలింగ్లో పోప్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతడు అవుట్ కావడంతో స్టేడియంలో ఉన్న అభిమానుల్లో ఒక్కసారిగా టెన్షన్ నెలకొంది. మైదానంపై బంతి మెలికలు తిరగడంతో ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది.

రజత్ ఔట్ అయిన తర్వాత జడేజా క్రీజ్ లోకి వచ్చాడు. అతడు కూడా నాలుగు పరుగులు చేసి బషీర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 120 పరుగులు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కూడా బషీర్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. అతడు పరుగులు ఏమీ చేయకుండానే క్యాచ్ అవుట్ అవ్వడం విశేషం. బషీర్ ఇప్పటికే ఈ ఇన్నింగ్స్ లో మూడు వికెట్లు తీశాడు. బషీర్ ధాటికి రజత్, సర్ఫ రాజ్ డక్ ఔట్ అయ్యారు. ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసిన ఇండియా.. విజయానికి ఇంకా 59 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో గిల్(23), ధృవ్(9) ఉన్నారు.