Hyper Aadi: హైపర్ ఆదికి పెళ్లి కాకపోవడానికి అసలు కారణం ఇదా… సంచలన విషయం వెలుగులోకి!

ఆది కామెడీ టైమింగ్ కి ఫిదా అవ్వని వారుండరు.ఆదికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అందులోనూ లేడీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం సినిమాలు, షో లు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీని వెనుక ఉన్న కారణం వెలుగులోకి రాగా అందరూ షాక్ అయ్యారు. అతని జాతకంలో దోషం ఉందట. పైగా ఆ దోషం పోవాలంటే ఎవరు చేయలేని పని ఒకటి చేయాలట.

Written By: NARESH, Updated On : February 26, 2024 12:49 pm

Hyper Aadi

Follow us on

Hyper Aadi: హైపర్ ఆది ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయి. స్పాంటేనియస్ గా పంచులు వేయడంలో ఆది తర్వాతే ఎవరైనా. జబర్దస్త్ షో లో కంటెస్టెంట్ గా వచ్చి .. టీం లీడర్ గా మారాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. మల్లెమాల ప్రొడక్షన్స్ లో పలు షోలు చేస్తూ తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నాడు.

ఆది కామెడీ టైమింగ్ కి ఫిదా అవ్వని వారుండరు.ఆదికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అందులోనూ లేడీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం సినిమాలు, షో లు చేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు. కానీ ఆయన ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీని వెనుక ఉన్న కారణం వెలుగులోకి రాగా అందరూ షాక్ అయ్యారు. అతని జాతకంలో దోషం ఉందట. పైగా ఆ దోషం పోవాలంటే ఎవరు చేయలేని పని ఒకటి చేయాలట.

హైపర్ ఆది శ్రీ దేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్ లో సందడి చేశాడు. కాగా పెళ్లి కొడుకు గెటప్ లో తాగుబోతు రమేష్ తో కలిసి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు జాతకంలో దోషం ఉందని అందుకే పెళ్లి కావట్లేదు అని తాగుబోతు రమేష్ చెప్పుకొచ్చాడు. ఇక ఆ దోషం పోవాలంటే ఆదికి ఒక ముసలావిడని ఇచ్చి పెళ్లి చేయాలని .. కానీ పెళ్లి చేసుకోవడానికి వృద్ధ మహిళలు ఎవరూ ఒప్పుకోవడం లేదని, అందుకే ఆది కి ఇప్పటివరకు పెళ్లి కాలేదని డైలాగ్స్ కొట్టాడు.

ఇక ఆదికి ఎలాగైనా పెళ్లి చేయాలని ఇద్దరు వృద్దురాళ్లను రమేష్ తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు కూడా నో చెప్పడంతో ఆది కి ఇక జన్మలో పెళ్లి కాదని అంతా తెగ నవ్వుకున్నారు. కాగా ఇదంతా స్కిట్ లో భాగమే. రియల్ లైఫ్ లో హైపర్ ఆది కి ఎటువంటి దోషం లేదు. కామెడీ కోసం ఇదంతా చేశారు.కాగా ఆయన జబర్దస్త్ కి దూరం అయ్యారు. ప్రస్తుతం ఢీ సెలెబ్రెటీ స్పెషల్, శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి షో లతో అలరిస్తున్నాడు.