Two Girls Fight Over Boyfriend: ప్రేమ కోసం తాజ్ మహల్ నిర్మించాడో చక్రవర్తి. భార్య కోసం భాగ్యనగరాన్నే నిర్మించాడు మరో చక్రవర్తి. ప్రేమ ఓ పవిత్రమైన పదం. అందమైన నిర్వచనం. జీవితంలో పెనవేసుకునే బంధం. ప్రేమ చిగురించని మనసుండదు. ప్రేమ పుట్టని మనిషి ఉండడు. అలాంటి ప్రేమకు ఎంతో మహత్తరమైన శక్తి ఉంది. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకునే వారున్నారు. ప్రాణం ఇచ్చే వారుండటం తెలిసిందే. ప్రేమకు ఉన్న బలం అలాంటిది. ఒకసారి ప్రేమలో పడితే దాని మూలాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అందుకే ప్రేమలో పడిన వారు తమను తామే మరిచిపోతుంటారు.

ఇక్కడ మాత్రం ఓ విచిత్రమైన సన్నివేశం. ప్రేమ కోసం అబ్బాయిలు కొట్టుకోవడం మామూలే. కానీ అమ్మాయిలు బాహాబాహీకి దిగడం ఆశ్చర్యకరమే. చెన్నైలోని అన్నానగర్ లో ఈ విచిత్రమైన సంఘటన జరిగింది. రోడ్డు మీదే ఇద్దరు అమ్మాయిలు జట్టుపట్టుకుని కొట్టుకోవడం సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు తగాదా పడటంతో అందరు విచిత్రంగా చూశారు.
అయితే ఈ అమ్మాయిలిద్దరు ఒకే కళాశాలకు చెందిన వారు కావడం గమనార్హం. ఇద్దరు ఒకరు సీనియర్, ఒకరు జూనియర్ కోర్సులు చదువుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కళాశాల యాజమాన్యం విచారణ చేపట్టింది. విద్యార్థినులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. అమ్మాయిలిద్దరు నడిరోడ్డుపై గొడవకు దిగడంతో చూసే వారందరు నివ్వెరపోయారు. అమ్మాయిలు జట్టు పట్టుకోవడంతో చర్చనీయాంశం అయింది.

సాధారణంగా అమ్మాయిల కోసం అబ్బాయిలు కొట్టుకోవడం సాధారణం. ఇక్కడ మొత్తం విరుద్ధంగా జరిగింది. ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కోసం నడి వీధిలో జట్లు పట్టుకుని అందరు చూస్తుండగానే ముష్టి ఘాతాలకు దిగడం చూసే వారికి ఆందోళన కలిగింది. అసలు వీరు ఎందుకు కొట్టుకుంటున్నారో అర్థం కాక చాలా మంది చూస్తుండిపోయారు. అంతా అయిపోయాక ఆరా తీస్తే వారు చేసిన ముష్టి ఘాతాలపై కళాశాల యాజమాన్యం తగు చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది కానీ యుద్ధాన్ని మాత్రం కాదని తెలుసుకోవాలి.