18 Pages Glimpse Video: ఎందుకు ప్రేమించామా..? అంటే ఆన్స‌ర్ ఉండకూడ‌దు

18 Pages Glimpse Video: నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కలిసి నటిస్తున్న మూవీ 18 పేజేస్ గ్లింప్స్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ’నాకు తెలియ‌ని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విష‌యం చెబుతూండేది..ప్రేమించ‌డానికి కార‌ణ‌ముండ‌కూడ‌దు..ఎందుకు ప్రేమించామా..? అంటే ఆన్స‌ర్ ఉండకూడ‌దు..’అని నిఖిల్ సంభాష‌ణ‌ల‌తో మొద‌లైంది వీడియో. కాగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఈ ’18 పేజెస్’ సినిమా రాబోతుంది. గీతా ఆర్ట్స్2, […]

Written By: Sekhar Katiki, Updated On : April 7, 2022 5:57 pm
Follow us on

18 Pages Glimpse Video: నిఖిల్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కలిసి నటిస్తున్న మూవీ 18 పేజేస్ గ్లింప్స్ వీడియోను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ’నాకు తెలియ‌ని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విష‌యం చెబుతూండేది..ప్రేమించ‌డానికి కార‌ణ‌ముండ‌కూడ‌దు..ఎందుకు ప్రేమించామా..? అంటే ఆన్స‌ర్ ఉండకూడ‌దు..’అని నిఖిల్ సంభాష‌ణ‌ల‌తో మొద‌లైంది వీడియో.

18 Pages Glimpse Video

కాగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఈ ’18 పేజెస్’ సినిమా రాబోతుంది. గీతా ఆర్ట్స్2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ మూవీని బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొత్తానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ మూవీ వస్తుంది అనే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక తన గత సినిమా ‘అర్జున్ సురవరం’తో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో నిఖిల్. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థ్, హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న మూవీ 18 పేజెస్. ఇక అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం నిఖిల్ తోనే ఎక్కువ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది.

18 Pages Glimpse Video

ఈ ’18 పేజెస్’ అనే చిత్రంలో అనుపమ – నిఖిల్ కలిసి నటిస్తున్నట్టే.. ‘కార్తికేయ 2’ చిత్రంలో కూడా నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిలే ఆమెకు ఛాన్స్ ఇప్పించాడని టాక్ కూడా ఉంది. 18 పేజెస్ మంచి వసూళ్లను రాబట్టి.. నిఖిల్ కెరీర్ లో బెస్ట్ మూవీగా నిలుస్తోంది అని టీమ్ చెబుతుంది. సినిమా బాగా వస్తోందట.

 

Tags