Two Brothers Dead Illness: వడదెబ్బ ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. రామలక్ష్మణుల ఉన్న వాళ్ళిద్దరిని తల్లిదండ్రులకు దూరం చేసింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా పాపటపల్లి లో చోటు చేసుకుంది. పాపటపల్లికి చెందిన పావురాల లీలా ప్రసాద్, మాధవి దంపతులు. వీరికి కార్తీక్ (9), ఆదిరాం(6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. లీలా ప్రసాద్ స్థానికంగా ఓ వ్యక్తి దగ్గర పెయింటింగ్ పనులు కి వెళుతున్నాడు. మాధవి ఖమ్మంలోని ఓ దుకాణంలో పని చేస్తోంది.

వేసవి సెలవులు కావడంతో కార్తీక్, అదిరాం ఇంటివద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో లో గత ఆదివారం పాపటపల్లిలో లీల ప్రసాదు ఉంటున్న ఇంటికి సమీపంలో ఒక వ్యక్తి మామిడి కాయలను విక్రయిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కార్తీక్, అదిరామ్ మండుటెండలో నే మామిడికాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లి వచ్చారు. అదేరోజు సాయంత్రం ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇద్దరు పిల్లల్ని స్థానికంగా ఉన్న ఆర్ఎంపి దగ్గరికి లీలా ప్రసాద్ తీసుకెళ్లాడు.
Also Read: Khammam District Politics: ఖమ్మంలో రసవత్తర రాజకీయం

అతడు చికిత్స నిర్వహించి ఖమ్మం తీసుకెళ్లాలని సూచించాడు. చేతిలో చాలినంత డబ్బు లేకపోవడంతో మార్కెట్లోకి తీసుకెళ్తామని లీలా ప్రసాద్ వాళ్ళిద్దర్నీ ఇంటికి తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి పరిస్థితి విషమించి పెద్ద కుమారుడు కన్నుమూశాడు. చేతిలో చిల్లిగవ్వ లేక పోవడంతో దాతలు తలా కొంత వేసుకుని చిన్న కుమారుడిని హైదరాబాదులోని రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటి నుంచి వారం పాటు అతడికి చికిత్స నిర్వహించారు. తిరుపతిలో ఆదివారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి చిన్న కుమారుడు కూడా కన్నుమూశాడు. వారం వ్యవధిలో ఇద్దరు కుమారులు కనుగొనడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తోంది. చేతిలో డబ్బులు ఉంటే పిల్లలు చనిపోయేవారు కాదని వారు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది.
Also Read:Sharad Power Presidential Candidate: రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవర్.. ఏకాభిప్రాయం దిశగా విపక్షాలు