
ఈ భూమ్మీద బతకాలని.. నాలుగు మెతుకులు తినాలనే యోగ్యం ఉంటే ఖచ్చితంగా యమ ధర్మరాజు ఎదురొచ్చినా బతికేస్తారు. రష్యాలోనూ అలాంటి వింత ఘటన చోటుచేసుకుంది.
రష్యాలోని మాస్కోకు 3700 కి.మీల దూరంలోని తూర్పు ప్రాంతంలో ఉరియం అనే గ్రామం ఉంది. ఆ ఊరుకొని ఆనుకొని ఒక నది ప్రవహిస్తోంది. తాజాగా వర్షాలకు నది ఉగ్రరూపంగా ప్రవహిస్తోంది. గతంలో కట్టిన కాంక్రీట్ నది కొట్టుకుపోవడంతో తాజాగా చెక్కలతో గ్రామస్తులే తాళ్లు కట్టి బ్రిడ్జి కట్టారు.
అయితే ఓ ట్రక్కు లారీ డ్రైవర్ దాన్ని గమనించకుండా చెక్కల బ్రిడ్జిపై నుంచి పోదామని వేగంగా వచ్చాడు. బ్రిడ్జి మధ్యలోకి రాగానే బరువు ఆపలేక ఆ కట్టెల బ్రిడ్జి కూలింది. ట్రక్కు ఆ భారీ నీటి ప్రవాహంలో పడిపోయింది. అయితే డ్రైవర్ మాత్రం లారీ నుంచి బయటపడి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు.
అయితే ఈ ట్రక్ డ్రైవర్ వల్ల ఆ గ్రామానికి రాకపోయాలు ఆగిపోయాయి. బ్రిడ్జి కూలిపోవడంతో ఇప్పుడు గ్రామం నుంచి బాహ్యప్రపంచానికి సంబంధాలు తెగిపోయినట్టైంది.
https://twitter.com/ChaudharyParvez/status/1418628677936455681?s=20