Viral Video: నలుగురి మధ్య పెళ్లి చేసుకోవాలి. నాలుగు గోడల మధ్య కాపురం చేయాలి.. అంటారు పెద్దలు. కానీ ఈ బెంగళూరు నగరానికి చెందిన దంపతులు వెడ్డింగ్ షూట్ లోనే, కళ్ళ ఎదురుగా ఫోటోగ్రాఫర్ ఉన్నాడని సోయి కూడా లేకుండా హద్దులు దాటారు. ముద్దుల్లో మునిగితేలారు.. దీంతో తలదించుకోవడం ఫోటోగ్రాఫర్ వంతు అయింది.

పెళ్లంటే ఒక మధుర జ్ఞాపకం కాబట్టి చాలామంది ఆ వేడుకను ఘనంగా జరుపుకుంటారు.. ఇప్పటి సాంకేతిక యుగంలో చాలామందికి ఆర్థిక స్థిరత్వం పెరగడంతో ఆ పెళ్లిని ఘనంగా జరుపుకుంటూనే.. దానికి ముందు వేడుకలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికోసమే ప్రత్యేకంగా అంకుర సంస్థలు కూడా పుట్టుకొచ్చాయి.. నిశ్చయ తాంబూలాల నుంచి పెళ్లి బరాత్ వరకు మొత్తం వాళ్లే చూసుకుంటారు.. ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ కూడా మంచి ప్రాచుర్యంలో ఉంది. డబ్బున్న వాళ్లు విదేశాలలో వివాహ తంతు నిర్వహించేందుకు తెగ ఉబలాట పడిపోతున్నారు..

ఇక వివాహానికి సంబంధించి ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది.. ఇందులో కొందరు ఒక అడుగు ముందుకేసి పాటలు కూడా చిత్రీకరిస్తున్నారు.. ముందుగానే చెప్పినట్టు సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఫ్రీ వెడ్డింగ్ షూటింగ్లో కూడా పలు మార్పులు వచ్చాయి. విభిన్నమైన లొకేషన్ లలో కాబోయే వధూవరులు ఫోటోలు తీయించుకుంటున్నారు.. ఇక బెంగళూరుకు చెందిన ఓ జంట ఇలానే ఫోటోలు తీయించుకుంది. అందులో భాగంగా ఫోటోగ్రాఫర్ కాబోయే వధువుకు ముద్దు పెట్టాలని వరుడుని కోరతాడు. దీనికి రెచ్చిపోయిన వరుడు ఆమెను ముద్దులతో ముంచేశాడు. వధువు కూడా ఆయనకు తగ్గట్టుగానే స్పందించింది.. దీంతో సిగ్గు పడిపోయి తల దించుకోవడం ఫోటోగ్రాఫర్ వంతు అయింది.. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.