Trolls On Nara Lokesh: మంగళం పాడరా అల్లుడా అంటే…మా అత్త వెండి గాజులు పెట్టుకోవాలి అన్నాడట! ఈ సామెత లాగానే ఉంది టిడిపి యువకిశోరం లోకేష్ బాబు పరిస్థితి. అసలే ఆయన నోరు తిరగదు. మేనమామ పోలిక అనుకుంటా.. పైగా నోరు తిరగని పదాలు పలుకుతుంటాడు. అవేమో వేరే అర్థానికి దారి తీస్తాయి. తీవ్రమైన చర్చకు కారణమవుతాయి. అసలే ఇప్పుడు సోషల్ మీడియా రోజులు.. ప్రతీ చిన్న దానికి భూతద్దం పెట్టి వెతికే రోజులు.. నిజానికి అబద్ధాన్ని లంకె వేసి చాటింపు వేసే రోజులు.. ఇలాంటి వారికి లోకేష్ దొరికితే ఇక ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి.

వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టిడిపి పావులు కదుపుతోంది.. 2014లో జరిపినట్టే ఈసారి కూడా బిజెపి, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇక ఇలాంటి సమయంలో తన కొడుకుని, 2019లో మంగళగిరిలో ఓడిపోయిన తన పుత్ర రత్నాన్ని భావి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు స్కెచ్ చేశాడు.. రేపటి నాడు జూనియర్ పార్టీని హైజాక్ చేయకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో ఒకటి యువ గళం. దీనిని నిన్న కుప్పంలో ప్రారంభించారు. అంతే కాదు లోకేష్ సమర శంఖం పూరించారు.. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఆయన తెలుగుతోనే.. పలికే మాటలతోనే.

అధికారంలో ఉన్నప్పుడు తనకు తెలుగు నేర్పించేందుకు… తెలుగు మాటలు పలికించేందుకు ప్రభుత్వ సొమ్ముతో ఈ ఏకంగా ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడిని నియమించుకున్నాడు.. దీని కోసం ప్రభుత్వం నుంచి జీతం ఇచ్చాడు . కానీ ఏం ఉపయోగం లేకుండా పోయినట్టుంది. 2019లో వచ్చిన 23 సీట్లు లాగే…లోకేష్ కు కూడా తెలుగు అరకొరగా ఆగింది. అందుకే కుప్పంలో ప్రశాంతతను చెడగొట్టి… ప్రశాంత్ అత్త ను తెరపైకి తీసుకువచ్చింది. ఇక జియో గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న నాయకులే నవ్వుకున్నారు.. మాలోకం… ఈ లోకంలో ఉన్నావు నాయనా అనుకున్నారు.. యువగళం పాదయాత్ర ఏమో కానీ.. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు తెగ ట్రోల్ అవుతున్నాయి.