Taraka Ratna Health: నటుడు తారకరత్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం ఆయనకు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్స్ తారకరత్నను పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం రాత్రి కుప్పం పీఈఎస్ ఆసుపత్రి నుండి ఆయన్ని ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు. భార్య అలేఖ్య రెడ్డి అనుమతి తీసుకొన్న వైద్యులు బెటర్ ట్రీట్మెంట్ కోసం బెంగుళూరు తీసుకెళ్లారు. తారకరత్న హెల్త్ బులెటిన్ రావాల్సి ఉంది. తారకరత్న ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఏమిటనే విషయంలో స్పష్టత లేదు. అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

నిన్న కుప్పం ఆసుపత్రిలో వైద్యుల కామెంట్స్ ప్రకారం ఆయన శరీరం నీలం రంగులోకి మారింది. హార్ట్ అటాక్ కి గురైన తారకరత్న శరీరం రంగు మారడం పలు అనుమానాలకు కారణమైంది. అసలు పాదయాత్ర లో ఏం జరిగింది? తారకరత్న శరీరం నీలంగా మారడానికి గల కారణాలు ఏమిటి? అనే సందేహాలు పలువురి మెదళ్లను తొలి చేస్తున్నాయి. ఈ క్రమంలో నిపుణులైన కార్డియాలజిస్ట్స్ దీనిపై వివరణ ఇచ్చారు.
తారకరత్న శరీరం నీలి రంగులోకి మారడానికి రక్త ప్రసరణ ఆగిపోవడమే అన్నారు. గుండె పనితీరు మందగించినప్పుడు శరీర భాగాలకు అవయవాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. దాని వలన కాలి వేళ్ళు, చేతి వేళ్ళు నీలం రంగులోకి మారతాయి. అలాగే తారకరత్న రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండి ఉండొచ్చు. ఈ కారణాలతో ఆయన శరీరం రంగు మారింది. సాధారణంగా గుండెపోటు కేసులో ఈ లక్షణాలు కనిపిస్తాయని చెప్పుకొస్తున్నారు.

జనవరి 27 శుక్రవారం ఉదయం కుప్పం నియోజకవర్గంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హీరో బాలకృష్ణ, తారకరత్న పాదయాత్రకు హాజరయ్యారు. లోకేష్ తో పాటు నడుస్తున్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పక్కనే ఉన్న గార్డ్స్, కార్యకర్తలు ఆయన్ని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికి తారకరత్న పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. పల్స్ రేటు చాలా తక్కువగా ఉండటాన్ని వైద్యులు గమనించారు. సీపీఆర్ చేయడంతో ఓ 45 నిమిషాల తర్వాత ఆయన గుండె పనితీరు మెరుగుపడింది. అక్కడి నుండి పీఈఎస్ ఆసుపత్రికి చేర్చారు. రాత్రి బెంగుళూరుకు తరలించారు.