Walking Trees: జీవకోటికి ప్రాణాధారం భూమి. దీని మీద ఉండే జీవులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి. మనుషులు, జంతువులు, కీటకాలు ఒక చోట నుంచి మరో చోటుకు కదులుతాయి. చెట్లను కూడా ఒక జీవిలాగే భావిస్తాం. కానీ అవి పెట్టిన చోటే పెద్దగా మారుతాయి. అయితే కొన్ని చోట్లు చెట్లు నడుస్తాయంటే నమ్ముతారా? కానీ ఆ ప్రదేశంలో చెట్లు పెట్టిన చోటు కాకుండా మరో చోటుకు కదులుతూ ఉంటాయి. అక్కడున్న వాతావరణం, భూ ప్రదేశాన్ని భట్టి చెట్లు ముందుకు, వెనకకు లేదా పక్కకూ జరుగుతూ ఉంటాయి. మరి ఈ చెట్లు ఎక్కడున్నాయో తెలుసుకుందామా.
సాధారణంగా ఒకచెట్టు ఒకచోటే పుట్టి దాని పైన విస్తరణ జరుగుతుంది. కానీ కొన్ని చెట్లు వేర్లతో పాతుకుపోయి కింద భూమిలో విస్తరిస్తుంది. కానీ ఈ చెట్లు మాత్రం వేర్లు ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్తాయి. సొక్రాటియా ఎక్సోర్హిజా ఇది ఆ నడిచే చెట్ల పేరు. కానీ వాడకంలో ‘వాకింగ్ పామ్స్ ’అని అంటారు. ఇవి దక్షిణ అమెరికా, బొలివియా, బ్రెజిల్, పెరూ, కొలంబియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వస్తుంటారు. షెర్రీ సీతాలెర్ అనే జర్నలిస్టు తన పుస్తకం ‘క్యూరియస్ ఫోక్స్ ఆస్క్ 2’ లో వాకింగ్ పామ్ గురించి రాశాడు. ఈ చెట్లకు ఉండే వేర్లు వాటి స్వభావాన్ని భట్టి ఒక చోటు నుంచి మరో చోటుకు కదులుతాయి.
ఈ చెట్లు కదలడానికి ఓ ప్రత్యేకత ఉంది. వాకింగ్ పామ్ చెట్ల వేర్లు, ఆకులు సూర్యకాంతిలో పెరుగుతాయి. దట్టమైన అడవుల్లో సూర్యకాంతి తక్కువగా ఉంటాయి. అందువల్ల సూర్యకాంతి కోసం ఇవి ముందుకు, వెనుకకు కదులుతూ ఉంటాయి. ఈ చెట్టుకు ఉండే వేర్లు అవి పెరడానికి కదలడం వల్ల చెట్టు అటూ ఇటూ మూవ్ అవుతుంది. ఇక చెట్టు బయట ఉండే వేర్లు మాత్రం ఇతర చోట పాతుకుపోతాయి. ఇలా సూర్య కాంతి కోసం ముందుకు అలా వెళుతూ ఉంటుంది. నడిచే చెట్ల గురించి బ్రెండా మిల్లర్ పవర్ ఎడ్యుకేషన్ లో జరిగిన చర్చలో ‘వాకింగ్ ట్రీస్ ఒక అద్భుతం’ అని పేర్కొన్నారు.