Transgender Majamma:‘పద్మశ్రీ‘ పొందిన ట్రాన్స్ జెండర్ చరిత్ర తెలిస్తే షాకవుతారు..

దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించేందుకు ఇచ్చే పద్మ పురస్కారాలను ఇటీవల ప్రభుత్వం అందించింది. 2020, 2021 సంబంధించిన అవార్డులను రెండు రోజుల పాటు అందించారు. కొవిడ్ కారణంగా గత సంవత్సరం అవార్డులు ప్రకటించినా వాటిని ఎంపిక చేసిన వారికి ఇవ్వలేదు. దీంతో ఈసారి రెండు రోజుల పాటు అందించారు. పద్మ విభూషన్, పద్మ భూషణ్, పద్మశ్రీ లతో పాటు ఇతర అవార్డులను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయా ప్రముఖులకు అందించారు. 2021 సంవత్సరానికి పద్మశ్రీ […]

Written By: NARESH, Updated On : November 10, 2021 3:22 pm
Follow us on

దేశంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించేందుకు ఇచ్చే పద్మ పురస్కారాలను ఇటీవల ప్రభుత్వం అందించింది. 2020, 2021 సంబంధించిన అవార్డులను రెండు రోజుల పాటు అందించారు. కొవిడ్ కారణంగా గత సంవత్సరం అవార్డులు ప్రకటించినా వాటిని ఎంపిక చేసిన వారికి ఇవ్వలేదు. దీంతో ఈసారి రెండు రోజుల పాటు అందించారు. పద్మ విభూషన్, పద్మ భూషణ్, పద్మశ్రీ లతో పాటు ఇతర అవార్డులను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయా ప్రముఖులకు అందించారు. 2021 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో ఈసారి ఓ ట్రాన్స్ జెండర్ కూడా ఉన్నారు. ఆమె పేరు మంజవ్వ. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈమె జానపద రంగంలో చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డును అందించారు. దీంతో మంజవ్వ గురించి తెలుసుకున్నవారు ఆమె చేసిన సేవలను కొనియాడుతున్నారు.

సమాజ సేవకురాలిగా..గొప్ప సంఘ సంస్కర్తగా పేరొందిన మంజవ్వ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పద్మశ్రీ అవార్డు అందుకునేటప్పుడు ఆమె రాష్ట్రపతి వద్దకు వచ్చిన సమయంలో అందరూ ఆశ్చర్యంగా చూశారు. అంతేకాకుండా మంజవ్వ రాష్ట్రపతికి దిష్టి తీశారు. ముందుగా ప్రథమ పౌరుడికి నమస్కారం చేసిన మంజవ్వ ఆ తరువాత తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీశారు. దేశంలో పద్మశ్రీ అందుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా నిలిచిన మంజమ్మ గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కల్లుకంబ గ్రామానికి చెందిన మంజమ్మ అసలు పేరు మంజునాథ్ శెట్టి. చిన్నవయసులనే యువతి లక్షణాలు కనిపించడంతో మంజమ్మగా పేరు మార్చుకున్నారు. ఆమె కుటుంబం కూడా మంజమ్మ కు సహకరించారు. ట్రాన్స్ జెండర్ గా మారేందుకు వారు ఒప్పుకున్నారు అయితే ఆ తరువాత జోగప్పగా మార్చడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకెళ్లి పూజలు చేయించారు. ఆ తరువాత జోగతిగా మారిన మంజవ్వ నృత్యం చేస్తూ, దేవుని పాటలు పాడుతూ ప్రాచర్యం పొందారు. ఆ తరువాత జానపద నృత్యకళాకారిణిగా ఎదిగారు. అయితే జోగిని కాళవ్వ మరణంతో ఆ బృందం బాధ్యతలను మంజవ్వ స్వీకరించింది.

కర్ణాటకలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారష్ట్రలో ఆమె జానపద నృత్యాలు చేస్తూ పాపురల్ అయింది. అంతేకాకుండా జానపద కళలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఆమెను పలు అవార్డులతో సత్కరించింది. 2006లో మంజమ్మకు జానపద అకాడమీ అవార్డు లభించింది. ఆ తరువాత 2019లో కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షులయ్యారు. ఇలా జానపద నృత్యాన్ని కాపాడడంలో ఎంతో కృషి చేస్తున్న మంజమ్మకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పద్మశ్రీతో సత్కరించింది.