Anasuya Bhardwaj: అనసూయ అంటే తెలియని తెలుగువారు ఉండరు. అనసూయ అంటే పేరు కాదు, ఒక బ్రాండ్ ఆనేలాగా క్రేజ్ సంపాదించుకుంది అనసూయ. ఒకవైపు బుల్లి తెర పై యాంకర్ గా రాణిస్తూ, మరో వైపు అవకాశాలు వచ్చినప్పుడల్లా వెండి తెర పై నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది అనసూయ భరద్వాజ్. యాంకర్ గా రాణిస్తూ మంచి మార్కులే సంపాదించుకున్న అనసూయ, మంచి నటిగా కూడా పేరు సంపాదించుకున్నది.
మలుపు తిప్పిన రంగస్థలం: అడపా దడపా సినిమాల్లో నటిస్తూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసుకుంటూ తన యాక్టింగ్ కెరీర్ ని ముందుకు తీసుకెళ్తున్న అనసూయ…. ఒక్కసారిగా టాలీవుడ్ ఒలిక్కిపడేలా చేసింది. దానికి కారణం సుకుమార్ ఇచ్చిన క్యారెక్టర్ వల్లనే. రంగస్థలం సినిమా రాంచరణ్ కి ఎంత పేరు ఇచ్చిందో అనసూయ కూడా అంతే పేరు తీసుకొచ్చింది. రంగమ్మ అత్త అంటే టక్కున అనసూయ పేరు వినపడేలా మాయ చేసింది అనసూయ. అలా సుకుమార్ అనసూయ కి మంచి పాత్ర ఇచ్చి ఆదరించాడు.
దాక్షాయణి గా మెరవనున్న అనసూయ: అయితే రంగమ్మత్త గా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ… మళ్ళీ ఇంకొక సారి దాక్షాయణి గా మెరవనుంది. సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. అయితే తాజా గా మైత్రి మూవీ మేకర్స్ అనసూయ లుక్ ని విడుదల చేశారు. ఈ లుక్ లో అనసూయ కురచ జుట్టు తో దర్శనమిచ్చింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో ఆస్క్ మీ ఎనీ థింగ్ అనే పోల్ పెట్టింది. ఒక అభిమాని మీరు సినిమాల కోసం గుండు కొట్టించుకుంటారా అనే ప్రశ్న అడగ్గా… దానికి అవును గుండు కొట్టించుకుంటా అని దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చి తన అభిమానికి షాక్ ఇచ్చింది అనసూయ భరద్వాజ్.