ప్రతీ మనిషి జీవితంలో అత్యంత ప్రధాన ఘట్టం పెళ్లి. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా వైభవంగా నిర్వహించుకోవాలని అనుకుంటారు. బంధువులు, స్నేహితులను పిలుచుకుంటారు. చుట్టాల మధ్య ఆడంబరంగా సంతోషంగా సాగేలా చూస్తారు. అయితే సాధారణంగా పెళ్లి వేడుకలో పెళ్లికొడుకు తరుపున స్నేహితులు కొత్త జంటను ఆటపట్టిస్తారు. వీరు టీజ్ చేసేది పెళ్లి కొడుకునే అయినా ఒక్కోసారి శృతి మించడంతో వివాదాలు ఎదురవుతాయి. అయితే కొందరు మాత్రం దానిని లైట్ గా తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో చాలా మంది పెళ్లి కూతుళ్లు మారు మాట్లాడకుండా కామ్ గా ఉంటారు. అయితే ఇక్కడో పెళ్లి కూతురు అబ్బాయి స్నేహితులు చేసే కామెడీకి తీవ్ర కోపం వచ్చింది. దీంతో ఆ వధువు ఏం చేసిందో తెలుసా..?
Also Read: Anasuya Bhardwaj: గుండు కొట్టించుకోవడానికైనా రెఢీ

సరదాలు.. సంబరాలు..ఆటలు.. పాటలతో సాగే పెళ్లిలో చిన్న చిన్న తప్పులు జరగుతూ ఉంటాయి. కొందరు పెద్దలు వీటిని పెద్దగా చేయకుండా మానేజ్ చేస్తూ ఉంటారు. ఈ తరుణంలో పెళ్లి చేసుకోబోయే వారు ఏమీ మాట్లాడకుండా సర్దుకుపోతుంటారు. కానీ అల్లరి మితిమీరితే ఎవరికైనా కోపం వస్తుంది. ఇక్కడ కొందరు చేసే అల్లరి మిగతా వారు పట్టించుకోకపోయినా పెళ్లి కూతురు మాత్రి రియాక్షన్ తీవ్రంగా ఇచ్చింది. అప్పటికీ వారు ‘అరెరెరె.. పెళ్లయిపోతుంది..పెళ్లయిపోతుంది..’ అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: Comedian Tear Story: బాత్రూమ్స్ కడిగిన వ్యక్తి ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా?
అయితే సరిగ్గా పెల్లికొడుకు మెడలో వధువు దండ వేసే సమయంలోనే వారి కామెంట్లు చికాకు పుట్టించాయి. దీంతో వధువు వారి వైపు సీరియస్ గా చూసింది. ఆ తరువాత సర్దుకొని మళ్లీ దండ వేయడానికి సిద్ధమైంది. కానీ వాళ్లు అదే పాట పాడుతున్నారు. ‘పెళ్లయిపోతుంది..పెళ్లయిపోతుంది..’అంటూ గోల గోల చేశారు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చి ఈసారి ‘నేనీ పెళ్లి చేసుకోను’ అంటూ దండను పక్కన బెట్టింది. దీంతో అక్కడున్న బంధువులు బుజ్జగించడంతో మరోసారి దండ తీసుకొని మొత్తానికి వరుడి మెడలో వేసింది.
ఈ వీడియోను కొందరు క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో ఉంచారు. దీనిపై రకారకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు పెళ్లిల్లో ఓవర్ చేస్తే ఇలాగే ఉంటుంది.. అని కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు మాత్రం సరదా కోసం ఆమాత్రం చేయకపోతే ఎలా ..? అని అంటున్నారు. అయితే ఇంకొందరు మాత్రం మొత్తానికి పెళ్లి అయిపోయిందిగా.. లైట్ తీసుకున్నారు లే.. అని మెసేజ్ పెట్టారు.కాగా ఈ వీడియోను నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి తన ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు చేశాడు.