Karkat Falls: బీహార్ రాష్ట్రంలో కైమూర్ జిల్లాలో కర్కట్ పేరుతో ఒక జలపాతం ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఈ జలపాతం జోరుగా ప్రవహిస్తోంది. ఈ అందమైన దృశ్యాలను చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తున్నారు. అలా ఆ ప్రాంతాన్ని చూసేందుకు కొందరు పర్యాటకులు వచ్చారు. అక్కడి జలపాతం అందాలను చూస్తున్నారు. తమ సెల్ ఫోన్లలో ఆ దృశ్యాలను బంధిస్తున్నారు. ఈలోగా జలపాతానికి వరద తాకిడి అనూహ్యంగా పెరిగింది. అకస్మాత్తుగా అక్కడ విపరీతమైన వర్షం కురిసింది. దీంతో పర్యాటకులు బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు చెట్లు ఎక్కి ప్రాణాలను కాపాడుకున్నారు. రాత్రి మొత్తం చెట్ల మీద జాగారం చేశారు. అయితే ఈ విషయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి తెలియడంతో.. పారు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. పర్యాటకుల ప్రాణాలను కాపాడారు.
ఆలస్యంగా తెలిసింది
పర్యాటకులు వరద నీటిలో చిటుకున్న విషయం కైమూర్ జిల్లా యంత్రాంగానికి, చైన్ పూర్ పోలీసులకు ఆలస్యంగా తెలిసింది. దీంతో వారు వెంటనే రంగంలోకి దిగారు.. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వారిని అతి కష్టం మీద కాపాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదనీరు బీహార్ రాష్ట్రాన్ని ముంచెత్తుతోంది. దీంతో ఆ జలపాతానికి వరదనీటి ప్రవాహం పెరిగింది. అందువల్లే పర్యాటకులు వరద నీటిలో చిక్కుకుపోయారు.. ఆ వరద నీటిని తగ్గించాలని ఉత్తరప్రదేశ్ సిబ్బంది కోరడంతో వారు ఆ పనిచేశారు. తర్వాత 40 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రాత్రి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. సోమవారం సాయంత్రానికి అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో 11 మంది పర్యాటకులు ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపారు.. ఆ 11 మందిని కాపాడిన తర్వాత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ధైర్య సాహసాలను కొనియాడుతున్నారు. గొప్ప పని చేశారంటూ కితాబిస్తున్నారు.
చెట్ల కొమ్మలను పట్టుకొని..
వాస్తవానికి ఆ పర్యాటకులు వెళ్లిన సమయంలో జలపాతం వద్ద వరద ఆస్థాయిలో లేదు. కానీ అప్పటికప్పుడు అక్కడ భారీ వర్షం కురిసింది. అ జలపాతానికి ఎగువ ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసాయి.. దీంతో వరద నీరు మొత్తాన్ని ఉత్తరప్రదేశ్ అధికారులు దిగువన ఉన్న బీహార్ రాష్ట్రానికి వదలడం మొదలుపెట్టారు.. ఫలితంగా అ జలపాతం ఉదృతంగా ప్రవహించడం మొదలుపెట్టింది.. దీంతో పర్యాటకులు వరద నీటిలో చిక్కుకోవాల్సి వచ్చింది. కనీసం అడుగు కూడా బయటపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. కొందరు పర్యాటకులు చెట్ల కొమ్మలను పట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు.