Tollywood comedians : 90లలో హాస్యం పండించే బాధ్యత బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ తీసుకున్నారు. తర్వాత ఈ లిస్ట్ లో తనికెళ్ళ భరణి, అలీ, మల్లికార్జున రావు, గుండు హనుమంతుతో పాటు పలువురు వచ్చి చేశారు. ఎందరు వచ్చినా బ్రహ్మానందం, కోటా, బాబు మోహన్ ల మార్క్ క్రియేట్ చేయలేకపోయారు. ముఖ్యంగా కోటా… అటు కరుడుగట్టిన విలన్ గా, ఇటు కడుపుబ్బా నవ్వించే కమెడియన్ గా రెండు భిన్నమైన షేడ్స్ లో పీక్స్ చూపించారు. బ్రహ్మానందం, కోటా, తనికెళ్ళ భరణి, చలపతిరావు, బాబూ మోహన్ సరదా సంభాషణల పాత ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. ఈ ఫోటో నెటిజెన్స్ ని ఆకర్షించింది.

1994లో విడుదలైన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ఆమె’ షూటింగ్ సెట్స్ లో తీసిన చిత్రం ఇది. షాట్ గ్యాప్ లో ఆ చిత్రంలో నటించిన ఈ కామెడీ గ్యాంగ్ మొత్తం కలిసి చిల్ అవుతున్నారు. దర్శకుడు ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆమె’ ఒక సెన్సేషన్. హీరోయిన్ ఊహ చుట్టూ కథ నడుస్తుంది. శ్రీకాంత్,సీనియర్ నరేష్ హీరోలుగా చేశారు. ఇక కోటా శ్రీనివాసరావు పిసినారి తండ్రిగా, జీతం కోసం కోడలితో పెళ్ళికి సిద్ధమైన మామగా వైవిధ్యం గల రోల్ చేశారు.
కోటా పిసినారి తనానికి బలయ్యే పెళ్లిళ్ల పేరయ్యగా బ్రహ్మానందం నటించారు. ఇక తనికెళ్ళ భరణి కామాంధుడైన ఊహ అక్క మొగుడు పాత్ర చేశాడు. ఈ ఫ్రేమ్ లో ఉన్న బాబు మోహన్, చలపతిరావు ఆమె సినిమాలో నటించలేదు. బహుశా సేమ్ లొకేషన్ లో షూటింగ్ జరగడంతో కలుసుకొని ఉండవచ్చు. దర్శకుడు ఇవివికి ఫేమ్ తెచ్చిన సినిమాల్లో ఆమె ఒకటి. లోతైన ఎమోషన్స్ తో ఇవివి ప్రేక్షకులను అలరించారు. దాంతో ఆమె బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.
హీరోగా ఎదుగుతున్న శ్రీకాంత్, ఫేడ్ అవుట్ అవుతున్న నరేష్ హీరోలుగా నటించారు. సినిమాలో ప్రధాన పాత్ర ఊహదే. లేడీ ఓరియెంటెడ్ అద్భుతాలు చేస్తున్న రోజుల్లో వచ్చిన ఆమె విశేష ఆదరణ దక్కించుకుంది. కామెడీ, ఎమోషన్స్, రొమాన్స్ కలగలిపి ఈవీవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించారు. ఆమె ఊహకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది. అనూహ్యంగా అల్లుడా మజాకా మూవీలో చిరంజీవి చెల్లిగా చేసి ఊహ కెరీర్ నాశనం చేసుకుంది. అల్లుడా మజాకా తర్వాత ఆమెకు సెకండ్ హీరోయిన్ రోల్స్ వచ్చాయి. 1997లో హీరో శ్రీకాంత్ ని ప్రేమ వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది.