Mahesh Babu Rejected Movies List: సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాలు మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ లను సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దాని వల్ల కొంతమంది హీరోలు తమ మార్కెట్ ను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇంకొందరు మాత్రం తమ మార్కెట్ ని మరింత పెంచుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఇక ఏది ఏమైనా కూడా ఇక్కడ మంచి కథను సెలెక్ట్ చేసుకొని సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన వాళ్లకు మాత్రమే మంచి గుర్తింపు లభిస్తుంది.
Also Read: టీమిండియా గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు.. ఇన్ని అద్భుతాలు జరిగాయి మరి
మహేష్ బాబు చేయాల్సిన మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ చేసి సూపర్ సక్సెస్ లను సాధించాడనే విషయం మనలో చాలామందికి తెలియదు… త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన ‘జల్సా’ , ‘అత్తారింటికి దారేది’ రెండు సినిమాలను మొదట మహేష్ బాబు తో చేయాలి అనుకున్నాడట. కానీ అనుకోని కారణాలవల్ల వాటిని పవన్ కళ్యాణ్ చేయాల్సి వచ్చింది. మొత్తానికైతే రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధించడం విశేషం…
ఇక పవన్ కళ్యాణ్ వెంకటేష్ కలిసి చేసిన ‘గోపాల గోపాల’ సినిమా కథ కూడా మొదట మహేష్ బాబు దగ్గరికి వచ్చిందట. వెంకటేష్ – మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా వచ్చి మంచి విజయాన్ని సాధించడంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లోనే ఈ సినిమా చేద్దామని మేకర్స్ అనుకున్నారట. కానీ పవన్ కళ్యాణ్ ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపించడం మహేష్ బాబు మొదటి నుంచి కూడా రీమేక్ ల వైపు పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ఆయన ఎంటైర్ కెరియర్ లో ఒక్క రిమైక్ కూడా చేయలేదు. కాబట్టి ఈ మూవీ రీమేక్ కావడంతో రిజెక్ట్ చేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపాడు… మొత్తానికైతే మహేష్ బాబు చేయాల్సిన మూడు సినిమాలను పవన్ కళ్యాణ్ చేసి సూపర్ సక్సెస్ సాధించడం విశేషం…ఇక ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్ హీరోలు సైతం టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు…