Chiranjeevi: గత ఆరేడు నెలల నుంచి సతమతమవుతున్న ఇండస్ట్రీకి ఓ దారి చూపించాడు చిరంజీవి. గత నెలలలో జగన్ తో లంచ్ మీటింగ్‌కు హాజరైన చిరంజీవి.. ఈరోజు సినీ స్టార్లతో కలిసి వెళ్లి కూలంకుషంగా మాట్లాడారు. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సమస్యక పరిష్కారం చూపాలనే ఉద్ధేశ్యంతో అన్నీ తానై ముందుండి నడిపించారు మెగాస్టార్. ఏపీలో టికెట్ల రగడకు ఎట్టకేలకు ఈ రోజు శుభం కార్డు పడినట్టు అయింది.

అయితే ఈ సమస్యకు భయపడి ఇన్ని రోజులు ఆర్ ఆర్ ఆర్ లాంటి పెద్ద సినిమాలు అన్నీ వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఈ తరుణంలోనే అందరి భుజం తట్టి తన వెంట తీసుకెళ్లి జగన్‌తో చర్చలు జరిపారు చిరంజీవి. టికెట్ల రేట్లతో పాటు షోల ప్రదర్శనపై జగన్ సర్కార్ విధించిన నిబంధనలను సైతం ఎత్తి వేసేలా చొరవ తీసుకున్నారు చిరంజీవి.
అయితే ఇందుకు జగన్ కూడా ఓకే చెప్పినట్టు వారంతా భేటీ అనంతరం మీడియాతో చెప్పారు. ఇక మిగతా వారంతా కూడా తమ సమస్యలపై ముందుండి ఇంత దూరం తీసుకు వచ్చినందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. తాము ఆరేడు నెలలుగా సినిమాలను వాయిదా వేసుకుంటూ వస్తున్నామని.. ఇలాంటి సమయంలో చిరంజీవి గారు తనకు జగన్ తో ఉన్న సన్నిహిత్యాన్ని ఉపయోగించి పరిష్కారం చూపించారని పొగడ్తలతో ముంచెత్తారు.

ఇలా అందరూ చిరును ప్రశంసలతో ముంచెత్తడంతో ఒక్కసారిగా చిరు ఇమేజ్ పెరిగిందనే చెప్పొచ్చు. అంటే తామెవరి వల్ల కాని పనిని చిరంజీవి చేసి చూపించారని వారు మెచ్చుకుంటున్నారన్న మాట. మొత్తానికి ఈ క్రెడిట్ మొత్తం చిరంజీవి ఖాతాలో పడిపోయింది. చిరంజీవి వల్లే ఇది సాధ్యం అయింది అన్నట్టు మిగతా స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఆయనకు థాంక్స్ చెప్పడమే చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దను చేసేశాయని చెప్పుకోవచ్చు.
Also Read: Chiranjeevi: జగన్ తో ఈ రోజు పరిష్కారం దొరికింది – చిరంజీవి
[…] Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ లీడ్‌లో నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో మ్యాటర్ ఉంది. ముఖ్యంగా మోహన్ బాబు డైలాగ్స్ అండ్ గెటప్స్ బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ట్రైలర్ ను కట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. మెయిన్ లీడ్ గా మోహన్ బాబు అదరగొట్టాడు. ఎక్కడా వయసు పై బడింది అనే ఫీలింగ్ ను తీసుకురాలేదు. […]