
Love Marriages: ప్రేమకు నిర్వచనం కష్టమే. ఎందుకంటే ప్రేమ అనంతమైనది. అన్ని జీవుల్లోనూ ప్రేమ ఉంటుంది. కానీ మనం గుర్తించం. ప్రేమతో దగ్గరకు తీసుకుంటే ఏదైనా మన వశం కావడం తథ్యం. ప్రేమకు ఉన్న మహత్యం అలాంటిది. అలాంటి పవిత్ర ప్రేమ నేడు కలుషితం అవుతోంది. ఎవరి స్వార్థం కోసం వారు ప్రేమను కుక్కలు చింపిన విస్తరి చేస్తున్నారు. దీంతో ప్రేమకు అందమైన రూపం అంటూ ఏదీ ఉండదు. లోకంలో ప్రేమ పుట్టని మనసుండదు. ప్రేమ చిగురించని వారుండరు. ప్రేమలో పడితే సమయమే తెలియదు. కబుర్లు, కాలక్షేపాలతో నిత్యం బిజీగా ఉండటం సహజమే. ప్రేమలో ఉన్న విలువ అలాంటిదే. ఓ దేవదాసు పార్వతి, లైలా మజ్ను, సలీం అనార్కలి ఇలా చెప్పుకుంటే పోతే ప్రేమికులు కోకొల్లలుగా ఉన్నారు. వారంతా ప్రేమను ప్రేమించారు. ప్రేమతోనే బతికారు. ప్రేమ కోసమే సర్వం అర్పించారు.
ప్రేమలో నిజాయితీ ఎంత?
ప్రస్తుతం ప్రేమ దారి మారుతోంది. సరదా కోసం ప్రేమించే వారున్నారు. కలకాలం ప్రేమగా చూసుకునేందుకు ప్రేమించేవారున్నారు. ఎవరి అర్థంలో వారు ప్రేమను వాడుకుంటున్నారు. కానీ ప్రేమలో నిజాయితీ ఎంత? ఎంత మంది ప్రేమను బతికిస్తున్నారు? ఎంత మంది అవసరాల కోసం ప్రేమిస్తున్నారు? కోరికలు తీర్చుకోవడానికి కూడా ప్రేమ అనే పేరు పెట్టుకుంటున్నారు. ప్రేమకు నిర్వచనమే మార్చేస్తున్నారు. అలా అని నిజాయితీతో ఉండే వారు లేరని కాదు. ప్రేమను ప్రేమగా ప్రేమించే వారు కూడా ఉన్నారు. ప్రేమను బతికించుకునేందుకు వారి సర్వస్వాన్ని ధారపోసి నిజమైన ప్రేమికులుగా నిలిచే వారు కూడా ఉన్నారు.
ప్రేమను వ్యక్తం చేసే..
ప్రేమను నిజాయితీగా వ్యక్తం చేసే వారు ఎంత మంది? సర్వేలు చెబుతున్న విషయాలు అయోమయంగా ఉన్నాయి. కేవలం 12 శాతం మంది మాత్రమే తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారట. అందులో సగం మంది మాత్రమే కన్న వారిని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారట. ప్రేమకు ఉన్న బలం ఇంతేనా? ఎందుకంత భయం అంటే మొదటి నుంచి కూడా తక్కువ శాతం మందే ప్రేమను ప్రేమిస్తున్నారు. దాన్ని సాధించుకుంటున్నారు. మిగతా వారు ఏదో చేద్దాం లే అనే ధోరణిలోనే వెళ్తున్నారు.

డబ్బుకే ప్రాధాన్యం
నేటి యువత ప్రేమకన్నా డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రేమించినా కట్నం ఎక్కువగా వస్తుందనుకుంటే దానికే మొగ్గు చూపుతున్నారు. ప్రేమలో ఉన్న వారిలో 46 శాతం మంది డబ్బునే ఇష్టపడుతున్నారు. ప్రేమను కాదని మనీకే విలువ ఇస్తున్నారు. దీంతో ప్రేమలో నిజాయితీ కరువవుతోంది. ప్రతి నలుగురిలో ముగ్గురికి ప్రేమ మీద నమ్మకమే ఉండటం లేదట. వారు పెళ్లిపీటల వరకు వెళ్లడం లేదట. దీంతో ప్రేమను బతికించుకునే వారి సంఖ్య తగ్గుతోంది. ప్రేమలో పడిన వారు ప్రేమ కోసం కాకుండా స్వార్థంతోనే వ్యవహరిస్తున్నారనే చెబుతున్నారు.
ప్రేమలో స్వచ్ఛత తగ్గుతోందా?
హైదరాబాద్ ముంబయి బెంగుళూరు ఢిల్లీ సహా 26 నగరాల్లో 26 వేల మంది 15 నుంచి 25 ఏళ్ల వయసు గల వారిపై అధ్యయనం నిర్వహించారు. ప్రేమలో వారు చూపుతున్న నిజాయితీ కనిపించడం లేదు. దీంతో మారుతున్న పరిస్థితుల్లో ప్రేమలో యువత అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతోనే ప్రేమికులు ఏదో కాలక్షేపం ప్రేమించుకుంటున్నారు. పెళ్లి అనే సరికి ఎవరి దారి వారు చూసుకుంటున్నారని చెబుతున్నారు. మొత్తానికి ప్రేమలో స్వచ్ఛత తగ్గుతోందని వారి నిర్వాకాల వల్ల అర్థమవుతోంది.