
Telangana Rain Alert: తెలంగాణను అకాల వర్షాలు బెదరగొడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా వడగళ్ల వానలు కడగళ్లు మిగుల్చుతున్నాయి. దీంతో రైతులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పంట నష్టపోయిన ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పరిహారం అందించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు అకాల వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో రైతుల గుండెల్లో మంట పుడుతోంది. పంటలు పూర్తిగా ధ్వంసం అవుతాయనే కలత చెందుతున్నారు. వడగళ్లు రైతుల కళ్లల్లో కడగళ్లు కలిగేలా చేస్తున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఇలా చేయడంపై రైతులు దిగులు పడుతున్నారు.
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కోసిన పంటలను ఆరుబయట ఉంచుకోవద్దని చెబుతున్నారు. ఇంట్లో, గోదాముల్లో, మార్కెట్ షెడ్లలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. వరి, మొక్కజొన్న లాంటి పంటలు ఉంటే మడుల్లో నీళ్లు ఉండకుండా గండ్లు కొట్టుకోవాలని చెబుతోంది. పంట కోసే దశలో ఉంటే తక్షణమే కోసేసుకోవాలని అంటున్నారు.
కూరగాయల పంటలకు వచ్చే మూడు నాలుగు రోజులు పురుగు మందులు, ఎరువులు వేయొద్దని చెబుతోంది. భారీ వర్షాలు ఉన్నందున మందులు వేస్తే వృథాగా పోతాయి. ఇప్పటికే రైతులకు తీవ్ర నష్టం జరిగింది. ఇంకా వానలు పడితే ఉన్న పంటలు కూడా పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఏం చేయాలో కూడా తోచడం లేదు. ప్రకృతి వైపరీత్యాలకు పంటలు నాశనం కావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ఇలాంటి వానలు రైతులను నిండా ముంచిన సంఘటనలు ఉండటం గమనార్హం.

ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులకు ఏం చేయాలో కూడా తోచడం లేదు. పంటలు ధ్వంసం కావడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వానకు దాదాపు చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. ఇక మిగిలిన పంటలను కూడా నాశనం చేసేందుకు ప్రకృతి మరోమారు సిద్ధమైంది. ఇందులో భాగంగానే మరో మూడు రోజులు వర్షాలు ఉన్నాయని హెచ్చరికలు చూస్తుంటే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.