
Urine Infection: వేసవి కాలంలో శరీరం వేడిగా ఉంటుంది. ఎండ ధాటికి మన శరీరం కూడా వేడిగా మారుతుంది. ఈ సమయంలో మూత్రంలో మంట రావడం సహజమే. ఎండ దెబ్బకు శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. మహిళల్లో యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీంతో పలు రకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో శరీరంలో ఏర్పడే వేడిని తగ్గించుకోవడానికి కొన్ని రకాల పానీయాలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల గుండెల్లో మంట, ఎసిడిటి వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
ఈ పానీయం తాగడం వల్ల కాల్షియం, పీచులు శరీరానికి అందడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీనికి మనం యాలకులు ఉపయోగిస్తున్నాం. ఒక కప్పు యాలకులు రాత్రి సమయంలో రెండు కప్పుల నీటిని పోసి నానబెట్టాలి. మరుసటి రోజు వాటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. తరువాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక లీటర్ నీరు పోసి వేడయ్యాక అందులో యాలకుల మిశ్రమం వేసి పావు గంట మరిగించాలి. తరువాత దాన్ని వడకట్టుకుని యాలకుల పొడిని గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి ొక కిలో పంచదార వేసి సన్నని మంట మీద పదినిమిషాలు మరిగించాలి.

తరువాత పావు కప్పు రోజ్ వాటర్, పావు స్పూన్ గ్రీన్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. తరువాత రెండు నిమ్మకాల రసం పిండాలి. ఈ మిశ్రమం చిక్కబడే వరకు మరిగించి పొయ్యి మీద నుంచి దించి చల్లారాక ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవాలి. ఇదిరెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. దీన్ని పాలు లేదా గ్లాస్ నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. వేసవి కాలంలో మనకు వేడి చేయడం సాధారణమే. దాన్ని తగ్గించుకునేందుకు ఈ చిట్కా పాటిస్తే సరి.
మన ఒంట్లో వేడిని తగ్గించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. శరీరం అనేక బాధలకు గురవుతుంది. అందుకే ఒంట్లో వేడిని తగ్గించుకునేందుకు ఈ పానీయం తాగితే సరిపోతుంది. ఈ సిరప్ రోజు తాగడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ యాలకుల పానీయం మనకు ఎన్నో రోగాల నుంచి దూరం చేస్తుంది. దీనికి అందరు చొరవ తీసుకుని దీన్ని తయారు చేసుకుని తాగాలి. అప్పుడే మనకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. యాలకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.