https://oktelugu.com/

3 People Dont Need Passport: ఆ ముగ్గురికి పాస్‌పోర్టు అవసరం లేదు.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరు.. ఎందుకు?

ప్రపంచంలో పాస్‌పోర్ట్‌ అవసరం లేని ఆ ముగ్గురు ఎవరనే విషయానికొస్తే.. వారు బ్రిటన్‌ రాజు, జపాన్‌ రాజు, రాణి. వీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. బ్రిటన్‌ రాయల్‌ ఫ్యామిలీకి చెందిన క్వీన్‌ ఎలిజబెత్‌కు ఈ అధికారం ఉండేది. తరువాత ఛార్లెస్‌ రాజయ్యాక అతనికి ఈ అధికారం సంక్రమించింది. ఈ అధికారం కేవలం ఛార్లెస్‌కు మాత్రమే ఉంటుంది. వారి ఫ్యామిలీలో ఎవరికీ లభించదు. జపాన్‌ రాజు, రాణికి కూడా పాస్‌పోర్టు లేకుండా ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లే అధికారం ఉంది. ఇది కూడా ఇద్దరికి మాత్రమే. వారి కుటుంబంలో ఎవరికీ ఆ అధికారం లేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 11, 2023 / 11:05 AM IST

    3 People Dont Need Passport

    Follow us on

    3 People Dont Need Passport: విమానం.. ఒక దేశం నుంచి మరో దేశానికి తక్కువ సమయంలో చేరే రవాణా సాధనం. దేశంలోని నగరాల మధ్య కూడా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. అయితే దేశంలో ఒక నగరం నుంచి మరో నగరానికి వెళ్లేందుకు టికెట్‌ కొంటే సరిపోతుంది. కానీ, ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే ఎవరికైనా పాస్‌పోర్ట్‌ అవసరం. దేశ అధ్యక్షుడు, ప్రధాని అయినా సరే పాస్‌పోర్టు తప్పనిసరిగా ఉండాలి. పాస్‌పోర్టు లేకుండా ఏ దేశంలోనూ కాలుమోపలేం. అయితే ఈ ముగ్గురు ఎటువంటి పాస్‌పోర్టు లేకుండా ఏ దేశానికైనా వెళ్లవచ్చు. వీరికి పాస్‌పోర్టుతో పనేమీ లేదు. మరి ఆ ముగ్గురు ఎవరు.. వారికి పాస్‌పోర్టు ఎందుకు అవసరం లేదో తెలుసుకుందాం.

    ఆ ముగ్గురు వీరే..
    ప్రపంచంలో పాస్‌పోర్ట్‌ అవసరం లేని ఆ ముగ్గురు ఎవరనే విషయానికొస్తే.. వారు బ్రిటన్‌ రాజు, జపాన్‌ రాజు, రాణి. వీరు విదేశాలకు వెళ్లాలనుకుంటే పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. బ్రిటన్‌ రాయల్‌ ఫ్యామిలీకి చెందిన క్వీన్‌ ఎలిజబెత్‌కు ఈ అధికారం ఉండేది. తరువాత ఛార్లెస్‌ రాజయ్యాక అతనికి ఈ అధికారం సంక్రమించింది. ఈ అధికారం కేవలం ఛార్లెస్‌కు మాత్రమే ఉంటుంది. వారి ఫ్యామిలీలో ఎవరికీ లభించదు. జపాన్‌ రాజు, రాణికి కూడా పాస్‌పోర్టు లేకుండా ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్లే అధికారం ఉంది. ఇది కూడా ఇద్దరికి మాత్రమే. వారి కుటుంబంలో ఎవరికీ ఆ అధికారం లేదు.

    ప్రముఖుల విషయంలో..
    ఏ దేశంలోనైనా ఎంతటి ప్రముఖులైనా విదేశాల్లో కాలుమోపేందుకు వారికి పాస్‌పోర్ట్‌ అవసరమవుతుంది. అయితే వారి దగ్గర డిప్లొమెట్‌ పాస్‌పోర్టు ఉంటుంది. ఇది ఏదేశానికి వెళ్లాలన్నా వారికి ప్రత్యేక గుర్తింపును కల్పిస్తుంది. అలాగే ఎయిర్‌పోర్టులో వీరికి ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వీరు ప్రత్యేక ప్రొటోకాల్‌ను పాటించాల్సి ఉంటుంది.

    భారత్‌లో ఇలా..
    భారత్‌ విషయానికొస్తే ఇక్కడ రాజ్యాంగబద్ధమైన కొన్ని పదవుల్లో ఉండే కొందరి దగ్గర డిప్లొమెట్‌ పాస్‌పోర్టు ఉంటుంది. దీని సాయంతో వారు తగిన ప్రొటోకాల్‌ పాటిస్తూ విదేశీయాత్ర చేయవచ్చు. అయితే వీరికి కూడా పాస్‌పోర్టు అవసరమవుతుంది. పాస్‌పోర్టు లేకుండా ఎవరూ విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. అది రాష్ట్రపతి అయినా, ప్రధాని అయినా..!