Homeట్రెండింగ్ న్యూస్Baidyanath Temple: ఆ చెరువు నిండా రావణుని మూత్రమే.. ఎక్కడుందో తెలుసా?

Baidyanath Temple: ఆ చెరువు నిండా రావణుని మూత్రమే.. ఎక్కడుందో తెలుసా?

Baidyanath Temple: మనదేశంలో రామాయణ, మహాభారత కథలతో ముడిపడిన ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. అవి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఆధారాలు, ఆనవాళ్లు కూడా లభిస్తున్నాయి. రామాయణం, భారత కథ అనేవారు ఆధారాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. నిజమే అని నమ్ముతున్నారు. ఇలాంటి వాటిలో విచిత్రమైన ప్రాంతాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటే రావణుని మూత్రంతో ఏర్పడిన చెరువు.

రావణుడు తెచ్చిన శివలింగం..
రావణుడు శివభక్తుడు. ఆయన భక్తికి ఆ పరమేశ్వరుడే ఆయనకు అనేక వరాలు ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. చాలా శక్తివంతుడు అయిన రావణుడు చిన్న తప్పుతో విలన్‌ అయ్యాడు. ఇక రావణుని గురించిన ఈ కథ ఎంతో వింతగా అనిపిస్తుంది. అయితే మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో ముడిపడిన కథలు స్థానికుల, పురాణాల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. రావణుని మూత్రంతో నిండిన చెరువు కూడా ఈ కోవలోకే వస్తుంది. జార్ఖండ్‌లోని బైద్యనాథ్‌లో అత్యంత ప్రాచీన శివాలయం ఉంది. ఈ ఆలయంలోని శివలింగాన్ని రావణుడు ఇక్కడికి తీసుకువచ్చాడని చెబుతారు.

అక్కడ నీటిని తకరు..
ఈ ఆలయానికి సమీపంలో రెండు చెరువులు ఉన్నాయి. వాటిలో ఒక చెరువు రావణుని మూత్రంతో ఏర్పడిందని చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడికి వచ్చేవారు కనీసం ఈ నీటిని తాకరు. అలాగే ఈ నీటిని ఏ పనులకు కూడా వినియోగించరు. మూత్రం అనే కారణంగానే ఇక్కడి చెరువులోని నీటిని తాకరని స్థానికులు చెబుతున్నారు.

రావణుని మొండితనాన్ని గ్రహించి..
ఆలయ స్థల పురాణం ప్రకారం ఒకసారి రావణుడు మహాశివునికి ప్రతిరూపమైన శివలింగాన్ని లంకకు బలవంతంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. రావణుని మొండితనాన్ని గ్రహించిన మహాశివుడు ఆ శివలింగాన్ని దారిలో ఎక్కడ కింద పెట్టినా, అది కదలదని చెబుతాడు. ఈ షరతు విన్న రావణుడు దానికి సరేనంటాడు. అయితే ఈ సంగతి తెలుసుకున్న విష్ణుమూర్తి ఇది జరగకుండా చూడాలని తిరిగి శివుడిని కోరుతాడు.

మూత్రం కోసం ఆగి..
శివలింగం తీసుకువెళుతున్న రావణుడు దారిలో మూత్రం(లఘుశంక) కోసం ఆగాల్సి వస్తుంది. ఈ సమయంలో మహావిష్ణువు బాలుని రూపంలో రావణునికి ఎదురవుతాడు. రావణుడు కాసేపు ఈ శివలింగాన్ని పట్టుకోవాలని ఆ పిల్లవాడిని కోరతాడు. రావణుడు లఘుశంక తీర్చుకుని తిరిగి వచ్చేసరికి ఆ బాలుడు కనిపించడు. అయితే ఆ శివలింగం అక్కడ నేలపై ఉంటుంది. రావణుడు ఆ శివలింగాన్ని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదట.

బైద్యనాథ్‌లో కొలువై..
ఆ శివలింగమే బైద్యనాథ్‌లో కొలువై పూజలు అందుకుంటోందని చెబుతారు. రావణుడు మూత్రం పోసిన ప్రాంతం చెరువుగా మారిందని, అందుకే దానిని రావణుని మూత్రం చెరువుగా అభివర్ణిస్తారు. అలాగే దీనిలోని నీటిని ఎవరూ వినియోగించరు. కాగా ఇది నమ్మకాలపైన ఆధారపడిన అంశమని, దీనిలో వాస్తవం లేదనేవారు కూడా ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version