
Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎస్వీ రంగారావు తరువాత అంతటి నటన మోహన్ బాబుదే ఉంటుందని అంటుంటారు. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పటికీ సినిమాల్లో కనిపిస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన 63ఏళ్లు నిండాయి. అయితే మోహన్ బాబు బర్త్ డే ఎప్పుడు గ్రాండ్ గా జరగదు. కనీసం బయటి వారికి కూడా తెలియదు. తన తోటీ నటులు ఆడంబరంగా వేడుకలు నిర్వహించుకుంటే మోహన్ బాబు మాత్రం సాదాసీదాగా జరుపుకుంటారట. బయటివారెవరినీ, ప్రముఖులను ఆహ్వనించడం ఆయనకు ఇష్టం లేదట. ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై సంచలన కామెంట్స్ చేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ఫీల్డులోకి ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు ఆ తరువాత విలన్ పాత్రలు ఎక్కువగా చేశారు. విలన్ అంటే మోహన్ బాబు లాగే ఉంటారన్నంత జీవించారు. ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాలను సక్సెస్ చేశారు. ఇక నిర్మాతగా కూడా పలు సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. ఇప్పటికీ చిన్న పాత్రల్లో కనిపిస్తూ అలరించే మోహన్ బాబు ప్రతీ సంవత్సరం బర్త్ డే వేడుకల గురించి ఎవరికీ తెలియనివ్వరు. ఆడంబరంగా బర్త్ డేలు చేసుకోవడం తనకు అలవాటు లేదని చెప్పారు.
మార్చి 19న మోహన్ బాబు జన్మించారు. 1976లో ఆయన బర్త్ డే వేడుకలను ఓ గార్డెన్ లో చుట్టుపక్కల వారి ఒత్తిడి మేరకు నిర్వహించుకున్నారు. ఆ తరువాత అసలు బర్త్ డే వేడుకలు ఎందుకు నిర్వహించుకోవాలి? అని తనకు తలిచినట్లు తెలిపారు. బర్త్ డే వేడుకల కోసం ప్రముఖులను ఎందుకు పిలవాలి? అని ఆలోచించి సక్సెస్ లేకపోతే బర్త్ డే వేడుకలు నిర్వహించుకోవద్దని నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. ఇలాంటి సమయంలో శ్రీవిద్యానికేతన్ స్కూల్ వార్షికోత్సవాన్ని మార్చి 19న నిర్వహించాలని అనుకున్నారు. 1993లో మొదటిసారి అలా మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా ఈ వేడుకలను విద్యార్థుల మధ్య నిర్వహించుకున్నారు. తాను విద్యానికేతన్ ద్వారా సక్సెస్ అయిన సందర్భంగా ఈ వేడుకలను పిల్లల మధ్య నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు.

ఇక మోహన్ బాబు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తన కష్టాలు పగవాడికి కూడా రావొద్దని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అయితే కష్టపడేతత్వాన్ని అలవరచ్చుకున్న తనకు దేవుడి అండ ఎక్కువగా ఉండడం వల్లే ఈ స్థితికి వచ్చినట్లు తెలిపారు. ఇక ఇన్నాళ్లు తాను పడ్డ కష్టాలు తనతోనే ఉండాలని పిల్లలకు కూడా రావొద్దనే ఉద్దేశంతో ఎంతో ఆరాటపడుతున్నట్లు తెలిపారు.