
Bigboss – 7 : తెలుగు బుల్లితెర పై సంచలనం సృష్టించిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’ .ఇప్పటి వరకు ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రెండవ సీజన్ న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించాడు.ఇక ఆ తర్వాత మూడవ సీజన్ నుండి ఆరవ సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ వచ్చాడు.ఆరవ సీజన్ కి డిజాస్టర్ రేటింగ్స్ వచ్చాయి.
ఎలిమినేషన్స్ విషయం లో పూర్తిగా అన్యాయం జరగడం వల్లే ఈ సీజన్ డిజాస్టర్ అవ్వడానికి
కారణమని అంటున్నారు విశ్లేషకులు.మరో పక్క వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున కి కూడా జనాల్లో ఆరవ సీజన్ వల్ల చెడ్డ పేరు వచ్చింది.దీనితో ఆయన తదుపరి సీజన్ చెయ్యడం లేదని బిగ్ బాస్ యాజమాన్యం కి కచ్చితంగా చెప్పేశాడట.దీనితో బిగ్ బాస్ యాజమాన్యం కొత్త హోస్ట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.
చాలా కాలం నుండి 7 వ సీజన్ కోసం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని, బిగ్ బాస్ యాజమాన్యం బాలయ్య చేత ఇందులో హోస్ట్ గా చెయ్యడానికి ఒప్పించిందని ఇలా పలు రకాల వార్తలు ప్రచారం అయ్యాయి.

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే ఈ సరికొత్త సీజన్ లో బాలయ్య బాబు తో పాటుగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీ లో ఇలా ఇద్దరి హోస్ట్స్ తో ఈ రియాలిటీ షో ని నడిపిన దాఖలాలు లేవు.సరికొత్త ప్లాన్ తో ఇలా చేసారని, కచ్చితంగా ఆడియన్స్ కి ఈ కాంబినేషన్ మంచి కిక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారట బిగ్ బాస్ యాజమాన్యం.ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ నుండి ఈ సరికొత్త సీజన్ ప్రారంభం కానుంది.