Sakunthalam Collections : కొన్ని కొన్ని సార్లు భారీ బడ్జెట్ సినిమాలు మన టాలీవుడ్ లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిల్చిన సందర్భాలు ఇది వరకు ఎన్నో మనం చూసాము.రీసెంట్ గా విడుదలైన సమంత ‘శాకుంతలం’ చిత్రం అందుకు ఉదాహరణ.డైరెక్టర్ గుణశేఖర్ దర్శకుడిగా మరియు సహనిర్మాతగా మారి తీసిన ఈ చిత్రం మొదటి రోజు మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.దిల్ రాజు ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించాడు,ఆయన బ్రాండ్ ఇమేజి కూడా ఈ చిత్రానికి ఉపయోగ పడలేదు.
వరుసగా హిట్టు మీద హిట్ కొట్టి మంచి ఊపు మీదున్న దిల్ రాజు కెరీర్ కి స్పీడ్ బ్రేకర్ వేసింది.ఇక సమంత కూడా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా హిట్ కొట్టింది.గత ఏడాది ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
అలా సమంత బ్రాండ్ కూడా ఈ సినిమాకి ఉపయోగపడలేదు.ఇవన్నీ సరిపోవు అన్నట్టు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ని కూడా ఈ సినిమాకోసం తీసుకున్నారు, అయినా ఫలితం లేకుండా పోయింది.ఇప్పటి వరకు 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ దాదాపుగా ఇక ముగిసినట్టే.ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఇప్పటి వరకు కోటి 30 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి.ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించారు.
సమంత కి అంత మార్కెట్ లేకపోవడం తో కేవలం 17 కోట్ల రూపాయలకు మాత్రమే థియేట్రికల్ బిజినెస్ చేసారు.ఇప్పుడు నిర్మాతకి మరియు బయ్యర్స్ కి థియేట్రికల్ వల్ల 13 కోట్ల రూపాయిల నష్టం రాగ, బడ్జెట్ పరంగా మరో 40 కోట్ల రూపాయిలు అదనపు నష్టం వచ్చిందట.ఒక పెద్ద హీరోయిన్ కి ఇలాంటి ఫలితం రావడం నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి.