Anil Ravipudi Balayya : బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా కథ ఇదే.. కామెడీ కేకలా ఉంటుందట..!

Anil Ravipudi Balayya :  టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ బాలయ్య సినిమా పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. ఇక బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నామని అనిల్ రావిపూడి తెలిపారు. ఫిబ్రవరి నుంచి […]

Written By: NARESH, Updated On : May 11, 2022 12:21 pm
Follow us on

Anil Ravipudi Balayya :  టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే అనిల్ బాలయ్య సినిమా పై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది.

Balayya Anil Ravipudi Movie

ఇక బాలయ్య గారిని కొత్త తరహాలో చూపించబోతున్నామని అనిల్ రావిపూడి తెలిపారు. ఫిబ్రవరి నుంచి స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభిస్తామని.. వచ్చే ఏడాది జూలై నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి – బాలయ్య బాబు లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది.

Also Read: Jagan Sketch On Chandrababu Arrest: చంద్రబాబును జైలుకు పంపేందుకు జగన్ భారీ స్కెచ్

సితార నాగవంశీ బాలయ్య అభిమాని. పైగా నందమూరి కుటుంబానికి నాగవంశీ అత్యంత సన్నిహితుడు. నిర్మాతగా బాలయ్యతో సినిమా చేస్తాను అని మాట ఇచ్చాడు. అందుకే ఎలాగైనా అనిల్ – బాలయ్య కలయికలో ఒక సినిమా చేయాలని ప్రయత్నాలు చేసి మొత్తానికి కాంబినేషన్ ను సెట్ చేశాడు.

Nandamuri Balakrishna

బాలయ్య-అనిల్ రావిపూడి సినిమా కథ గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ చక్కర్లు కొడుతోంది. హీరో బాలయ్య 30 ఏళ్ల వయసులో చేసిన గొడవల కారణంగా జైలుకు వెళతాడట.. ఆవేశంలో చేసిన ఆ గొడవలతో హీరోకు ఏకంగా 14 ఏళ్లు శిక్ష పడుతుందట.. జైలు నుంచి రిలీజ్ అయిన ఆ 44 ఏళ్ల హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ తెరకెక్కుతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నాడు. నిజానికి అనిల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమా చేయాలనుకున్నాడు. కాకపోతే, మహేష్, రాజమౌళితో సినిమా కోసం కొత్త సినిమాలు అంగీకరించే పరిస్థితిలో లేడు. మరోపక్క సితార ఎంటర్ టైన్మెంట్స్ కి అనిల్ రావిపూడి ఒక సినిమా చేయాలి.

Also Read: Chandrababu To Jail: చంద్రబాబును జైలుకు పంపడం జగన్ కు సాధ్యం అవుతుందా? సవాల్లేమిటీ?