https://oktelugu.com/

Condom Cafe: ఏంటి.. వాటితో కేఫ్ కట్టావా?.. నీ ఐడియాకు నరాలు కట్ అయిపోతున్నాయి భయ్యా!

థాయ్ లాండ్ లో పర్యాటకం ఎక్కువగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. వారికోసం అక్కడ రకరకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

Written By:
  • Rocky
  • , Updated On : August 16, 2023 / 05:08 PM IST

    Condom Cafe

    Follow us on

    Condom Cafe: సాధారణంగా కేఫ్ దేనితో కడతారు? ఇది కూడా ఓ ప్రశ్నేనా అంటారా? సరే మీరు ఏమనుకున్నా పర్వాలేదు కానీ.. అభివృద్ధి చెందని ఆఫ్రికా నుంచి అభివృద్ధి చెందిన అమెరికా వరకు కేఫ్ అంటే ఇసుక, సిమెంట్, కంకర, ఇనుము తోనే కడతారు.. మిగతా ఎలివేషన్ వర్క్ కు ఇతర సామగ్రి వినియోగిస్తారు. వారి అభిరుచికి అనుగుణంగా అందులో రకరకాల మార్పులు, చేర్పులు చేస్తారు.. ప్రపంచంలో ఇప్పటివరకు నిర్మితమైన కేఫ్ లన్నీ దాదాపుగా ఇలానే ఉన్నాయి. ఇక ముందు కూడా ఇలానే ఉంటాయి. కానీ నలుగురికి నచ్చినది నాకు నచ్చదు అన్నట్టు విలాసానికి, విశృంఖలత్వానికి మారు పేరయినా థాయ్ లాండ్ లో కేఫ్ ను వినూత్నంగా నిర్మించారు. ఇంతకీ ఆ కేఫ్ నిర్మించిన తీరు చూస్తే మీరు నోర్లు వెళ్ళబెట్టడం ఖాయం. ఇంతకీ ఆ కేఫ్ ను దేనితో నిర్మించారనేదే కదా మీ అనుమానం. అయితే ఎందుకు ఆలస్యం.. చదివేయండి ఈ కథనం.

    కం** దేనికి వాడతారు? మళ్ళీ ఇదేం ప్రశ్న గురూ అని అనుకోకండి. ఈ సువిశాల ప్రపంచంలో కం** ను పెళ్లి కాని యువత సేఫ్టీ కోసం వాడతారు. పెళ్ళయిన వారు ఇప్పుడే పిల్లలు వద్దూ అనుకుంటే వాటిని వాడతారు. ఇంకా రకరకాల అలవాట్లు ఉన్నవారు, రకరకాల వ్యసనాలు ఉన్నవారు సుఖం పొందుతున్నప్పుడు మిగతావేవీ అంటకుండా తొడుగు లాగా వాడతారు. కం** అనేదే లేకుంటే ఈ ప్రపంచం ఏమైపోయేదో.. కానీ ఇప్పటివరకు దీనిని దేనికోసం వాడతారో మనం తెలుసుకున్నాం. కానీ థాయ్ లాండ్ లో ఓ వ్యక్తి కం** లను సొంతానికి కాకుండా.. మరో పని కోసం వాడాడు.

    థాయ్ లాండ్ లో పర్యాటకం ఎక్కువగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు. వారికోసం అక్కడ రకరకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అయితే పర్యాటకులను విశేషంగా ఆకర్షించాలని ఉద్దేశంతో ఓ వ్యక్తి చాలా విభిన్నంగా కం** లతో కేఫ్ నిర్మించాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేఫ్ లో ఉన్న ప్రతీ నిర్మాణంలో కం** ఆకృతి ఉండే విధంగా రూపొందించాడు. అంతేకాకుండా విడిగా ప్రత్యేకమైన స్టాల్స్ ఏర్పాటు చేసి అందులో రకరకాల ఫ్లేవర్స్ తో కూడి ఉన్న కం** లను అందుబాటులో ఉంచాడు..వ్య**** అనేది థాయ్ లాండ్ దేశంలో చట్టబద్ధం కాబట్టి ఈ విధంగా అతడు కేఫ్ నిర్మించాడు. అక్కడ రకరకాలైన ఆహార పదార్థాలు, విదేశాలకు సంబంధించిన మద్యం బ్రాండ్లు, విడిది గృహాలు నిర్మించాడు. దేశవిదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ విధమైన ప్రయత్నాన్ని చేశానని కేఫ్ నిర్వాహకుడు అంటున్నాడు. బహుశా ప్రపంచంలో కం** లతో నిర్మించిన కేఫ్ తనదే అని గర్వంగా చెబుతున్నాడు. అన్నట్టు ఈ కేఫ్ లో విడిది చేసేందుకు పర్యాటకులు అమితమైన ఆసక్తి ప్రదర్శిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ కేఫ్ కు అందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసినవారు
    “ఏంటి.. వాటితో కేఫ్ కట్టావా?.. నీ ఐడియాకు నరాలు కట్ అయిపోతున్నాయి భయ్యా” అంటూ కామెంట్లు చేస్తున్నారు.