Pawan Kalyan: పవన్ పోటీ చేసే నియోజకవర్గం పై ఫుల్ క్లారిటీ..

ప్రస్తుతం పవన్ యాత్ర గాజువాక నియోజకవర్గం లో కొనసాగుతోంది. గాజువాక నియోజకవర్గం ప్రజలు పవన్ కు నీరాజనాలు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. చేజేతులా పవన్ను వదులుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Written By: Dharma, Updated On : August 16, 2023 5:14 pm

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: పవన్ వారాహి యాత్ర విశాఖలో కొనసాగుతోంది. జనసైనికులు, విశాఖ నగరవాసుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. యాత్రకు తరలివస్తున్న అశేష జనవాహినిని చూసి పవన్ రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగిస్తున్నారు. వైసీపీ సర్కార్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా విశాఖలో పొలిటికల్ హీట్ నెలకొంది. మరోవైపు మంత్రులు, ఎంపీల భూదందా, కబ్జాల ను క్షేత్రస్థాయిలో పవన్ పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం పవన్ యాత్ర గాజువాక నియోజకవర్గం లో కొనసాగుతోంది. గాజువాక నియోజకవర్గం ప్రజలు పవన్ కు నీరాజనాలు పలుకుతున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. చేజేతులా పవన్ను వదులుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ తన ప్రసంగాల్లో ఎక్కువగా గాజువాక నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో జగన్ను నమ్మి.. తనను చట్టసభలకు పంపించక పోవడాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా సరే తాను బాధపడనని.. గాజువాక ప్రజల ఉత్సాహం చూస్తుంటే.. వచ్చే ఎన్నికల్లో ఈ సీటు తప్పకుండా జనసేన కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గాజువాక సీటు కచ్చితంగా జనసేన దేనని.. తాను కాకపోయినా తన పార్టీ నుంచి ఎవరో ఒకరిని నిలబెడతానని పవన్ ప్రకటించారు.

అయితే పవన్ తాజా ప్రకటనతో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి తెర పడినట్లు అయ్యింది. గత ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓటమి ఎదురైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో గాజువాక నుంచి బరిలో దిగుతారని జనసేన శ్రేణులు భావించాయి. కానీ తాను గాజువాక నుంచి పోటీ చేయడం లేదని పవన్ తేల్చేశారు. దీంతో ఆయన భీమవరం నుంచి బరిలో దిగుతారా? అన్న అనుమానం కలుగుతుంది.

వాస్తవానికి పవన్ పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో చాలా రకాలుగా చర్చ జరుగుతోంది. అనంతపురం నుంచి గాజువాక వరకు.. దాదాపు పది నియోజకవర్గాల పేర్లు వినిపిస్తున్నాయి. అనంతపురం, తిరుపతి, భీమవరం, పిఠాపురం, కాకినాడ రూరల్, గాజువాక, విశాఖ ఉత్తర నియోజకవర్గాల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే పవన్ మనసులో ఏముందో బయటకి వెల్లడి కావడం లేదు. వచ్చే సంక్రాంతి తర్వాతే దీనిపై క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.