
Regent Vigilante Birds: పక్షులంటే మనలో చాలామందికి ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇంట్లో పక్షుల్ని పెంచుకోవడం ఒక అభిరుచి. వాటికి ఆహారం అందిస్తూ, నీరు పెడుతూ, పక్షుల్లో ఎదుగుదల చూసి ఆనందిస్తుంటారు. వాస్తవానికి మనుషులకు, పక్షులకు ఉన్న అవినాభావ సంబంధం ఈనాటిది కాదు. పూర్వకాలంలో వర్తమానాలను చేరవేసేందుకు రాజులు పక్షులనే వాడేవారు. యుద్ధాల్లో కూడా పక్షులను తమ అస్త్రాలుగా వాడుకునేవారు. పూర్వ కాలంలో మొదలైన స్నేహం ఇవాల్టికి కూడా కొనసాగుతూనే ఉంది. కానీ అలాంటి పక్షుల్లో మనుషులను చంపేసేవి కూడా ఉన్నాయి. ముట్టుకుంటే చాలు ప్రాణాలు తీసే భయంకరమైన రెండు పక్షులను శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. డెన్మార్క్ లోని న్యూగీనియా అడవుల్లో ఉన్నట్టు గుర్తించారు. విషం దాచుకున్నట్టు కనిపెట్టారు.
సాధారణంగా ఈ పక్షులు పుట్టుకతో మంచివే. కానీ అడవుల్లో విషపూరిత ఫలాలు, పదార్థాలను ఆరగించి, న్యూరో టాక్సిన్ గా మార్చుకుంటున్నాయి. వాటిని తమ రెక్కల్లో నిలువ చేసుకుంటున్నాయి. కాలానుగుణంగా ఆ న్యూరో టాక్సిన్ లను తట్టుకుని జీవించే సామర్థ్యం వాటి శరీరానికి కలిగింది. దీనికి తోడు జన్యుపరమైన మార్పులతో అవి మరింత కఠినంగా మారాయి. ఇటీవల న్యూ గినియా అడవుల్లో శాస్త్రవేత్తలు పరిశీలించినప్పుడు ఈ పక్షులను గుర్తించారు.

తాజాగా గుర్తించిన రిజెంట్ విజిలెర్ (పచీ సెఫాలా స్క్లీ గెల్లీ), ర ఫోస్_ నేఫ్ట్ బెల్ బర్డ్( అలి డ్రియాస్ రుఫి సుచా) అనే పక్షి జాతులకు చెందినవి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ జాతులు అధికంగా కనిపిస్తుంటాయి. సౌత్ సెంట్రల్ అమెరికాలో ఉండే డార్ట్ కప్పలు అత్యంత విషపూరితమైనవని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఈ కప్పలను తాకితే కొద్దిసేపట్లోనే మరణం సంభవిస్తుంది. డార్ట్ కప్పల్లోని విషం లాంటిదే ఈ పక్షుల్లోనూ ఉన్నట్టు పరిశోధకులు కనిపెట్టారు.. పక్షుల్లో బాట్రా సోటాక్సిన్ అనే విషం అధిక మోతాదులో ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. ఇలాంటి విషమే గోల్డెన్ పాయిజన్ కప్పల చర్మంలో ఉంటుంది.
విషం నిల్వ ఉన్న ఈ పక్షుల ఈకలను తాగితే కండరాల్లో పక్షవాతం లాంటిది ఏర్పడుతుంది. గుండె కొట్టుకోవడం అయిపోతుంది. చివరకు మృత్యువు కాటేస్తుంది. ఇదంతా కూడా క్షణాల వ్యవధిలో జరిగిపోతుంది. అయితే పక్షుల శరీరంలో సోడియం ఛానల్స్ ను క్రమబద్ధం చేసే ప్రాంతాల్లో మార్పుల వల్ల వాటిల్లో విషాన్ని తయారుచేసుకొని నిల్వ చేసుకోవడంతో పాటు తట్టుకునే శక్తి స్వతంత్రంగానే అభివృద్ధి చెందిందని, దాని వల్లే అవి ఇలా మారుతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంకా మరిన్ని ప్రయోగాలు చేసి అత్యంత విషపూరితమైన పక్షుల జాబితాను ప్రపంచానికి తెలియజేస్తామని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.