
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల విడాకుల వార్తలతో వెలుగులోకి వచ్చారు.దీనికి నిహారిక దంపతుల సోషల్ మీడియా బిహేవియర్ కారణమైంది. మార్చి నెలలో నిహారిక భర్త వెంకట చైతన్య ఇంస్టాగ్రామ్ నుండి పెళ్లి ఫోటోలు తొలగించాడు. అలాగే నిహారిక జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలు డిలీట్ చేశారు. నిహారిక మాత్రం ఎలాంటి ఫోటోలు తొలగించలేదు. ఒకరినొకరు సోషల్ మీడియా అకౌంట్స్ నుండి అన్ ఫాలో చేసుకున్నారు. ఇటీవల నిహారిక కూడా తన ఇంస్టాగ్రామ్ నుండి మ్యారేజ్ ఫోటోలు తొలగించారు. ఒకటి రెండు ముఖ్యమైన ఫోటోలు మాత్రం ఉంచి… మిగతావి డిలీట్ చేశారు.
ఈ పరిణామాలు నేపథ్యంలో నిహారిక-వెంకట చైతన్య విడిపోయారంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఇవి ఊహాగానాలు మాత్రమే. నిహారిక, వెంకట చైతన్య కుటుంబ సభ్యుల్లో ఎవరు కూడా అధికారిక ప్రకటన చేయలేదు. సమర్థిస్తూ లేదా ఖండిస్తూ స్టేట్మెంట్ ఇవ్వలేదు. దీంతో ఒక సస్పెన్సు కొనసాగుతోంది. విడాకుల వార్తలు నేపథ్యంలో నిహారిక చర్యలు కొన్ని ఆసక్తి రేపుతున్నాయి.
నిహారిక కెరీర్ మీద పూర్తిగా ఫోకస్ పెట్టారు. ఆమె నిర్మాతగా బిజీ కానున్నారు. నిహారిక చాలా కాలం క్రితం పింక్ ఎలిఫెంట్స్ పేరుతో ఓ బ్యానర్ స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ లో నిహారిక కొన్ని షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. నాన్నకూచి, మ్యాడ్ హౌస్ లాంటి సిరీస్లు ప్రాచుర్యం పొందాయి. నిహారిక స్మాల్ బడ్జెట్ వెబ్ మూవీస్ కూడా చేస్తున్నారు. నిర్మాణ సంస్థను మరింత ముందుకు తీసుకెళుతాన్నారు. పింక్ ఎలిఫెంట్స్ బ్యానర్ లో ఆమె వరుస ప్రాజెక్ట్ కి ప్లాన్ చేస్తున్నారు.

ఈ మేరకు దర్శకులు, రచయితలతో చర్చలు జరుపుతున్నారు. స్టోరీ డిస్కషన్స్ లో పాల్గొంటున్నారు. యంగ్ టాలెంట్ ని నిహారిక తన బ్యానర్ ద్వారా ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంస్టాగ్రామ్ ద్వారా నిహారిక తెలియజేశారు. చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. కాగా నిహారిక ఒక మనసు చిత్రంతో హీరోయిన్ అయ్యారు. ఒకటి రెండు తమిళ చిత్రాలు చేశారు. ఒక మనసు తర్వాత తెలుగులో హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించారు. నటిగా ఆమెకు కలిసిరాలేదు. అయినా ఇండస్ట్రీ పై మక్కువతో నిర్మాతగా కొనసాగుతున్నారు.