Balakrishna Next Films : సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణకు ఉన్న గుర్తింపు మరే హీరోకు లేదని చెప్పొచ్చు..ఆయన సినిమాలంటే ఫ్యాన్స్ లో ఎక్కడలేని ఉత్సాహం… ఆయన చెప్పే డైలాగ్స్ కు థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే.. దీంతో బాలయ్య సినిమా కోసం ఆవురావురుమంటూ అభిమానులు ఎదురుచూస్తారు. ఫ్యాన్స్ లో జోష్ పెంచేందుకు బాలయ్య సైతం గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తుంటారు. ‘అఖండ’ సినిమా తరువాత బాలయ్య వరుసబెట్టి సినిమాలకు కమిట్ అయ్యారు. ఇప్పటికే 108 మూవీ స్ట్రాట్ అయింది. ఈ మూవీ తరువాత మరికొన్ని సెట్స్ పైకి వెళ్లనున్నాయి. అయితే బాలకృష్ణ సీనియర్ డైరెక్లర్లతో కాకుండా క్రేజీ సంపాదించుకున్న కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఒకటి, రెండు సినిమాలు తీసి సక్సెస్ అందుకున్న యువ దర్శకులు ఇప్పుడు బాలయ్యతో డైలాగ్స్ చెప్పేందుకు రెడీ అవుతున్నారు. మరి ఆ అదృష్టవంతులు ఎవరో చూద్దాం..
బాలకృష్ణ రీసెంట్ గా గోపిచంద్ మలినేనితో కలిసి ‘వీరసింహారెడ్డి’లో నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఏమాత్రం గ్యాప్ లేకుండా మరో మూవీకి కమిట్మెంట్ అయ్యారు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి 108వ సినిమా చేస్తున్నారు. కామెడీ సినిమాలతో మెప్పించిన అనిల్ రావిపూడి బాలకృష్ణ తో ఎలాంటి కామెడీ చేయిస్తారో చూడాలి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుండగా తారకరత్న మరణించారు. దీంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు. అయితే దీనిని దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తన్నారు. ఈ సినిమా తరువాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో మూవీ రానుంది. బాలకృష్ణ-బోయపాటి కాంబోలో ఇప్పటికే 3 సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచారు. ఇప్పుడు 4వ సినిమాకు ఓకే చెప్పారు. ఈ సినిమా వచ్చే 2024 ఎలక్షన్ మూమెంట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ‘అన్ స్టాపబుల్’ షో తో బాలయ్య ఆకట్టుకుంటున్నారు. ఈ షో ను నిర్వహిస్తున్న ప్రశాంత్ వర్మతోనూ బాలయ్య ఓ సినిమా ఒకే చెప్పాడట. తెలుగులో అ, కల్కి, జాంబిరెడ్డి లాంటి డిఫరెంట్ మూవీస్ తో మెప్పించిన ప్రశాంత్ వర్మ ఆధ్వర్యంలో ‘హనుమాన్’ రూపుదిద్దుకుంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా పూర్తయిన తరువాత బాలకృష్ణతో సినిమా చేయనున్నారు. అయితే బాలయ్యతో ఎలాంటి డిఫరెంట్ మూవీ చేస్తారో చూడాలి. కల్యాణ్ రామ్ కు బింబిసార అందించిన డైరెక్టర్ వశిష్టకూ బాలకృష్ణ అవకాశం ఇవ్వనున్నారు. ఇది గీతా ఆర్ట్స్ బ్యానర్లో రానుంది. బింబిసార 2 తరువాత ఈ సినిమా ప్రారంభం అవుతుంది.
మహేష్ తో ‘సర్కారు వారి పాట’ తీసి జనాల్లో ఇంప్రెస్ కొట్టేసిన పరుశురామ్.. బాలయ్యతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఇప్పటికే కథ రెడి చేసిన ఆయన త్వరలో వినిపించనున్నారు. ఈ విషయాన్ని ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్లో వెల్లడించారు. రవితేజతో పలు సినిమాలు తీసి హిట్ అందించిన జీఎస్ రవి సైతం బాలయ్యకు కథ చెప్పడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పడంతో బాలయ్య ఒప్పేసుకున్నాడట. త్వరలో ఫుల్ స్టోరీ చెప్పే అవకాశం ఉంది. వీరే కాకుండా పూరి జగన్నాథ్, కొరటాల శివ, వెంకీ అట్లూరి, త్రివిక్రమ్, సంపత్ నంది లాంటి వారికి బాలయ్య ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒకప్పుడు సీనియర్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేసే బాలయ్య ఇఫ్పుడు ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకున్న జూనియర్లకు ఛాన్స్ ఇవ్వనున్నారు. యంగ్ హీరోలకు పోటీనిస్తూ అభిమానులను ఆకట్టుకోనున్నారు. యువ డైరెక్టర్లు సైతం బాలయ్యకు అనుగుణంగా స్టోరీని మార్చి సినిమా తీసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరో రెండు, మూడేళ్లు బాలయ్య సినిమాలకు కొదవలేదని అర్థమవుతోంది.