https://oktelugu.com/

Social Media Celebrities: సోషల్ మీడియా వల్ల ఫుల్ ఫేమస్ అయిన సెలబ్రెటీలు వీరే..

Social Media Celebrities మై విలేజ్ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించిన గంగవ్వ బిగ్ బాస్ షో వరకు వెళ్లింది. ఈమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. తన యాసతో మాట విధానంతో సినిమా స్టార్లను కూడా కలిసేంత రేంజ్ ను సంపాదించింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 10, 2024 / 04:16 PM IST
    Follow us on

    Social Media Celebrities: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాపులర్ అవుతున్నారు. రొటీన్ కు భిన్నంగా ఏదైనా చేస్తే చాలు మంచి పాపులారిటీ వచ్చేస్తుంటుంది. ఆ పాపులారిటీ ద్వారా డబ్బులు సంపాదించడం మాత్రమే కాదు సినిమాల్లో ఛాన్స్ లు కూడా వస్తుంటాయి. అయితే రీసెంట్ గా కొందరు వ్యక్తులు సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీ హోదాను పొందారు. అందులో ముఖ్యంగా గంగవ్వ, బర్రెలక్క, పల్లవి ప్రశాంత్, కుమారీ ఆంటీ, కుర్చీ తాతలు ముఖ్యమని చెప్పాలి. ఒకసారి వీరి గురించి చూసేయండి..

    మై విలేజ్ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించిన గంగవ్వ బిగ్ బాస్ షో వరకు వెళ్లింది. ఈమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. తన యాసతో మాట విధానంతో సినిమా స్టార్లను కూడా కలిసేంత రేంజ్ ను సంపాదించింది. ఒక చిన్న ఛానెల్ ద్వారా వచ్చిన ఈమె ఎంతో గుర్తింపు సంపాదించింది. ఇగ బిగ్ బాస్ షో తర్వాత పలు సినిమాలకు ప్రమోషన్ వీడియోలు కూడా చేసింది. అయితే ఈ తర్వాత బర్రెలక్క కూడా మంచి పేరును సంపాదించింది. పని లేక బర్రెలు కాస్తున్న అనే ఒక్క వీడియోతో ఫుల్ పాపులర్ అయింది.

    ఏకంగా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేసే రేంజ్ కు వచ్చింది బర్రెలక్క. అయితే గెలుపు ఓటములు సాధ్యం. కానీ ఈమె ధైర్యానికి మెచ్చుకున్నవారే ఎక్కువ. ఇక బర్రెలక్క ఎమ్మెల్యే సీటుకు ఎంపిక కాకపోయిన కొన్ని ఓట్లను మాత్రం సంపాదించింది. ఇక ఈమె ఎంపీ కి కూడా పోటీ చేస్తుందట. మరి చూడాలి ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో అనేది. ఇక పల్లవి ప్రశాంత్ గురించి కూడా ప్రత్యేకంగా ఈయన కూడా రైతు గురించి మాట్లాడుతూ.. ఆయన వ్యవసాయం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేస్తూ మరింత పాపులర్ అయ్యారు.

    ఇక కుర్చీ తాత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుర్చీ మడత పెట్టి అనే డైలాగుతో ఫుల్ ఫేమస్ అయ్యారు. ఈయన డైలాగుతో ఏకంగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో పాటనే వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు ఈయన రేంజ్ ఏంటో.. ఇక రీసెంట్ గా ఫుల్ ఫేమస్ అయినా కుమారీ ఆంటీ గురించి తెలిసిందే. ఏకంగా ఈమె గురించి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈమె బిజినెస్ ను రన్ చేసుకోవడానికి ఆర్డర్స్ ఇచ్చాడు. ఇలా వీరందరూ కూడా చిన్న చిన్న డైలాగులతో చిన్న చిన్న వీడియాలతో ఫుల్ ఫేమస్ అయ్యారు.