Moon: చంద్రునిపై దశాబ్దాల క్రితమే మనిషి అడుగు పెట్టాడు. యూరీ గగారిన్ చంద్రునిపై అడుగు పెట్టిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. ఇక ఇస్రో ఇటీవలే చంద్రునిపైకి లాండర్‌ను పంపించి అగ్రదేశాల సరసన నిలిచింది. చంద్రునిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. చందమామ రహస్యాలు శోధించేందుకు అనేక దేశాలు దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అక్కడ మనిషి జీవించే రోజు త్వరలోనే వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. అయితే చంద్రునిపై సౌండ్ ఉండదు. అక్కడకు వెళ్లినవారు కూడా వినికిడి శక్తిని కోల్పోతారు. ఎందుకో తెలుసుకుందాం.
ఏమీ వినపడవు..
చంద్రునిపై శబ్దం వినపడదు. అక్కడకు వెళ్లినవారు ఏమీ వినలేరు. మాట్లాడితే వారి మాటలు వారికి కూడా వినపడవు. దీనివెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. భూమి మీద మన మాటలను మనతోపాటు ఇతరులు కూడా వింటారు. ఏ శబ్దం చేసినా అందరికీ వినబడుతుంది. దీనికి కారణం గాలి. గాలి కారణంగానే ధ్వని ఒకచోటు నుంచి మరో చోటుకు ప్రసారం అవుతుంది. అలా మన చెవులకు కూడా చేరుతుంది.
గాలి లేకపోవడంతో..
చంద్రునిపై గాలి ఉండదు. అందుకే అక్కడ పుట్టిన ధ్వని తరంగాలు అక్కడే ఉంటాయి. ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రసారం కావు. దీంతో శబ్దాలు వినబడవు. మనకు చెవుడు వచ్చిందన్న భావన కలుగుతుంది. మనం మాట్లాడిన మాటలు కూడా మనకు వినపడవు.