https://oktelugu.com/

India Vs England 2nd Test: మరోసారి ఫెయిల్ అయిన శ్రేయాస్ అయ్యర్, గిల్… వీళ్ళ పరిస్థితి ఏంటి..?

పుజారా, రహానే ఇద్దరు కూడా ఫామ్ ను కోల్పోవడంతో టీమ్ లో చోటుని కల్పించుకోలేకపోయారు. దాంతో అయ్యర్, గిల్ ఇద్దరికీ మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళని. వాళ్ళను ప్రూవ్ చేసుకోవడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : February 3, 2024 / 09:36 AM IST
    Follow us on

    India Vs England 2nd Test: ఇండియన్ క్రికెట్ టీమ్ లో మంచి ప్లేయర్లు గా గుర్తింపు పొందిన శ్రేయాస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ ప్రస్తుతం పేలవమైన పర్ఫామెన్స్ ఇస్తూ భారీ విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు సీనియర్ ప్లేయర్లు అయిన చటేశ్వర పుజారా, అజంక్య రహానే లాంటి ప్లేయర్లు ఇండియన్ టీమ్ టెస్ట్ క్రికెట్ లో తమదైన సేవలు అందిస్తూ మ్యాచ్ లను ఈజీగా గెలిపిస్తూ వచ్చారు. ఇక వీళ్ల వల్ల జూనియర్ ప్లేయర్లైన శ్రేయస్ అయ్యర్, శుభ్ మన్ గిల్ లకు టీమ్ లో ఆడే అవకాశాలు పెద్దగా రాలేదు. దాంతో చాలామంది సీనియర్ ప్లేయర్ల వల్ల జూనియర్ ప్లేయర్లైన వీళ్ళకి టీమ్ లో ఆడే అవకాశాలు ఎక్కువగా రావడం లేదు అంటూ కామెంట్లు చేశారు.

    ఇక ఇప్పుడు పుజారా, రహానే ఇద్దరు కూడా ఫామ్ ను కోల్పోవడంతో టీమ్ లో చోటుని కల్పించుకోలేకపోయారు. దాంతో అయ్యర్, గిల్ ఇద్దరికీ మంచి అవకాశాలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా వాళ్ళని. వాళ్ళను ప్రూవ్ చేసుకోవడం లేదు. ఇక శ్రేయస్ అయ్యార్ అయితే గత 11 ఇన్నింగ్స్ లలో ఒక్క హాఫ్ సెంచరీని కూడా నమోదు చేయలేదు అంటే నిజంగా ఆయన ఫామ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ మీద ఆడిన మొదటి టెస్ట్ లో ఫెయిల్ అయ్యాడు.

    అలాగే రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కూడా 27 పరుగులు చేసి పెద్ద గా ఆకట్టుకోలేకపోయాడు. ఈయన మొదట బాగా అడుతున్నప్పటికి దాన్ని లాంగ్ ఇన్నింగ్స్ గా కన్వర్ట్ చేయడం లో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. అలాగే శుభ్ మన్ గిల్ కూడా పెద్దగా పర్ఫార్మ్ చేసిన ఇన్నింగ్స్ లు అయితే ఏమీ లేవు ఐదు టెస్ట్ మ్యాచ్ ల్లో ఆయన అత్యధిక స్కోరు 35 పరుగులు మాత్రమే అంటే నమ్మశక్యం కాని విషయమనే చెప్పాలి. ఇక ఇంగ్లాండ్ మీద ఆడిన రెండో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 34 పరుగులు చేసిన గిల్ ఆఫ్ సెంచరీ కొడతాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి ఆశల మీద నీళ్లు చల్లుతూ 34 పరుగుల వద్దే అవుట్ అయిపోయాడు. మరి వీళ్ళిద్దరూ ఎందుకు ఇంత దారుణమైన పర్ఫామెన్స్ ఇస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు.

    ఇక వీళ్ళ పర్ఫామెన్స్ చూసిన చాలా మంది ఇండియన్ క్రికెట్ అభిమానులు అయితే మీరు ఆడితే సరిగ్గా ఆడండి, లేకపోతే పక్కకు తప్పుకోండి, మీ ప్లేస్ లో కొత్త ప్లేయర్లు ఆడి వాళ్ళ సత్తా ని చూపించుకోవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు అంటూ కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో ఆడడానికి సర్ఫ రాజ్ ఖాన్ రెడీగా ఉన్నాడు. ఇక మొదట్లో గిల్ ఓపెనర్ గా మంచి పర్ఫామెన్స్ ను ఇస్తు ఆడాడు. ఆ ప్లేస్ ని విడిచిపెట్టి నెంబర్ త్రీ లో ఆడుతున్నాడు. ఇక దానివల్ల ఫెలవుతున్నాడు. కాబట్టి మళ్లీ ఓపెనర్ గా కొనసాగుతాను అంటే ఇప్పుడు అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఓపెనర్ గా ఆడుతున్న జైశ్వాల్ అద్భుతమైన ప్రదర్శనని ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆడితే నెంబర్ 3 లోనే ఆడి తన సత్తాను చూపించుకోవాలి, లేకపోతే మ్యాచ్ నుంచి పక్కకు తప్పుకోవాలి. అంతే తప్ప గిల్ కి మరో ఆప్షన్ అయితే లేదు…ఇక మిగిలిన మూడు టెస్ట్ మ్యాచ్ లకు ఈ వారం లోనే జట్టును ప్రకటించనున్నారు. మరి ఆ ప్లేయర్ల లో అయ్యర్, గిల్ ప్లేస్ దక్కించుకుంటారో లేదా చూడాలి…