https://oktelugu.com/

Vikram – Puri Jagannath : విక్రమ్, పూరి కాంబో లో రావాల్సిన సినిమా ఎలా మిస్ అయిందో తెలుసా..?

ఒకవేళ ఈ సినిమా కనక తేడా కొడితే ఇక ఇండస్ట్రీలో పూరి పరిస్థితి డైలామాలో పడినట్టే అని సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు...

Written By: , Updated On : February 3, 2024 / 09:26 AM IST
Puri Jagannadh

Puri Jagannadh

Follow us on

Vikram – Puri Jagannath : సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రనైనా అలవోకగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించడంలో కొంత మంది నటులు ముందు వరుసలో ఉంటారు. అలాంటి వాళ్ళలో తమిళ నటుడు అయిన విక్రమ్ ఒకరు. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగులో ఉన్న స్టార్ హీరోలకు ఎలాంటి మార్కెట్ అయితే ఉందో, ఆయనకు కూడా దాదాపు అలాంటి మార్కెటే ఉంది. ఇక్కడ ఆయనకి సక్సెస్ రేట్ తక్కువైన కూడా మార్కెట్ మాత్రం భారీగా ఉందనే చెప్పాలి.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన అపరిచితుడు సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం తో ఆ తర్వాత విక్రమ్ తో ఒక సినిమా చేయడానికి తెలుగు దర్శకులు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యం పూరి జగన్నాథ్ కూడా ఆయనతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు, కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా సెట్స్ మీదికి రాలేదు. ఆ తర్వాత కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా సెట్ అవ్వలేదు. కానీ విక్రమ్ మాత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. అలాగే ఇప్పటికి కూడా విక్రమ్ కి పూరి జగన్నాథ్ టైప్ ఆఫ్ మేకింగ్ అంటే చాలా ఇష్టం అంటూ ఆయన చాలా సార్లు చెప్పాడు. అయినప్పటికీ విక్రమ్ కి, పూరి సినిమాలో నటించే అదృష్టం అయితే ఇంకా రాలేదని రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా విక్రమ్ తెలియజేశాడు.

పూరి విక్రమ్ తో సినిమా చేద్దాం అనుకునే సమయంలోనే పూరి చేసిన పోకిరి సినిమా సూపర్ సక్సెస్ అవడంతో, వరుసగా తెలుగు హీరోలు సినిమాలు చేయమని అడిగారట దాంతో పూరి వీళ్ళను కాదనలేకపోయాడు. దానివల్లే విక్రమ్ ప్రాజెక్టు అనేది డిలే అవుతూ వచ్చింది. మొత్తానికైతే ఆ సినిమా ఇప్పుటి వరకు కూడా పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం పూరి జగన్నాథ్ రామ్ హీరోగా ‘డబుల్ ఇస్మార్ట్ ‘ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ అయితే పూరికి మరోసారి స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. ఒకవేళ ఈ సినిమా కనక తేడా కొడితే ఇక ఇండస్ట్రీలో పూరి పరిస్థితి డైలామాలో పడినట్టే అని సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…