https://oktelugu.com/

Woman Eats Soap: టేస్టీగా ఉందని సబ్బు తినేసింది.. ఆ తర్వాత ఈ యువతికి ఏమైందో తెలుసా?

సోప్‌ మాదిరిగా ఉన్న కేక్‌. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన సుచి దత్తాకు బేకింగ్‌ అంటే ఎంతో ఇష్టం. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వైవిధ్యమైన కేకులను ఆమె తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 12, 2023 / 01:59 PM IST

    Woman Eats Soap

    Follow us on

    Woman Eats Soap: అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, ఆడపిల్ల కాదేదీ కవితకు అనర్హం అన్నారు కవి శ్రీశ్రీ.. కానీ ఇక్కడ ఓ ఆడపిల్ల సబ్బు బిల్లను కేక్‌ తిన్నతంత ఈజీగా తినేసింది. అంతేకాదు ఆ యువతి తనకు సోప్‌ తినడమంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. ఈ వీడియో క్లిప్‌ షోషల్‌ మీడియా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

    సోప్‌ కాదు కేక్‌..
    అయితే ఆమె తిన్నది నిజంగా సబ్బు కాదు. సోప్‌ మాదిరిగా ఉన్న కేక్‌. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాకు చెందిన సుచి దత్తాకు బేకింగ్‌ అంటే ఎంతో ఇష్టం. ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు వైవిధ్యమైన కేకులను ఆమె తయారు చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల ఆమె తయారు చేసిన ఒక కేకు అచ్చం సబ్బు మాదిరిగా ఉంది. సోప్‌ను పోలిన ఆ కేక్‌ను తింటూ ఆమె ఒక రీల్‌ చేసింది.

    ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు..
    సుచి దత్తా ఈ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో అది వైరల్‌ అయ్యింది. ఇప్పటి వరకు సుమారు 30 లక్షల మంది ఈ వీడియో క్లిప్‌ చూశారు. సుచి దత్తా సోప్‌ తినడంపై చాలా మంది నెటిజన్లు షాక్‌ అయ్యారు. అయితే ఆమె తిన్నది సబ్బు మాదిరిగా ఉన్న కేక్‌ అన్నది చివరకు తెలుసుకున్న కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు. నెటిజన్ల కామెంట్లకు సుచి దత్తా రిప్లయ్‌ కూడా ఇస్తున్నారు. కొన్ని కామెంట్లకు సుచి దత్తా రిప్లై కూడా ఇచ్చింది.