Rumeysa Gelgi: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ రుమీసా గెల్గీ. ఈమె ఇంతవరకూ విమానం ఎక్కలేదు. ఎందుకంటే ఆమెకు సరిపడా సీట్లు విమానంలో లేవు. 7 అడుగుల 0.7 అంగులాల పొడువు ఉండే గెల్టీ తొలి విమాన ప్రయాణానికి టర్కీష్ ఎయిర్ లైన్స్ పెద్ద కసరత్తునే చేసింది. ఆమె 13 గంటల ప్రయాణం కోసం ఆరు ఎకనామీ సీట్లను తీసివేసి వాటి స్థానంలో ప్రత్యేక స్టెచర్ ను అమర్చారు. ఇలా ఈమె తొలి విమానయానం చేసే అవకాశాన్ని కల్పించారు.

7 అడుగుల 0.7 అంగుళాల పొడవు ఉన్న రుమేసా గెల్గి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా పేరుపొంది గత సంవత్సరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఆమె సెప్టెంబరులో శాన్ ఫ్రాన్సిస్కోకు వెళ్లేందుకు వీలుగా వారి విమానాల్లో ఒకదాంట్లో ఆరు సీట్లను తొలగించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆమె 13 గంటల విమానంలో ప్రయాణించడానికి ప్రత్యేక స్ట్రెచర్‌ను ఏర్పాటు చేసింది.
24 ఏళ్ల గెల్గి ఇంతకుముందు ఎప్పుడూ విమానంలో ప్రయాణించలేకపోయింది. వీవర్ సిండ్రోమ్ వ్యాధి కారణంగానే అమె ఇంతలా ఎత్తు పెరిగింది. ఈ వ్యాధి కారణంగా ఆమె ఎముకల పెరుగుదలకు కారణమైంది.. చిన్నతనంలో కూడా ఆమె చాలా పెద్దగా కనిపించేది. విమానం సీట్లలో సరిపోయేలా ఉండేది కాదు. ఆమె తన పరిస్థితి కారణంగా బయట తిరగడానికి సాధారణంగా వీల్ చైర్ లేదా వాకర్‌ని ఉపయోగిస్తుంది.
గెల్గి ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రయాణ చిత్రాలను పంచుకుంది. “ప్రారంభం నుండి ముగింపు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం” అని తనకు ప్రయాణ సౌకర్యం కల్పించిన టర్కిష్ ఎయిర్ లైన్స్ కు కృతజ్ఞతలు తెలిపింది. ఇది నా మొదటి విమాన ప్రయాణం, కానీ ఇది ఖచ్చితంగా చివరిది కాదు. ఇప్పటి నుండి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడం నాకు చాలా గౌరవంగా సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని ఆమె ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి , గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో కలిసి పని చేయడానికి గెల్గి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లారు. గెల్గి 2014లో తన మొదటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను గెలుచుకుంది. 2021లో అధికారికంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా అవతరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యువకురాలిగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అతి పెద్ద చేతులు, పొడవాటి వేలు, వెన్నెముక ఉన్న మహిళగా కూడా ఆమె రికార్డు సృష్టించింది.ఇన్ని ఘనతలున్నా ఈమెను టర్కీష్ ఎయిర్ లైన్స్ ఇలా గౌరవం ఇచ్చింది.