Uttar Pradesh Husband And Wife: జీవితంలో పెళ్లి ఒకసారి చేసుకుంటారు. దాని కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తాడు. కాబోయే జీవిత భాగస్వామి గురించి ఎన్నో కలలు కంటాడు. తన జీవితం ఓ నందనవనం కావాలని చూస్తుంటాడు. ఎవరి కలలకు అనుగుణంగా వారు తమకు కాబోయే భార్య గురించి తర్జనభర్జన పడుతుంటాడు. వివాహం తరువాత జరిగే మధుర ఘట్టం శోభనం కోసమైతే ఎన్నో విధాలా ఊహించుకుంటాడు. దానికి గాను ఎంతో ఆతృత పడుతుంటాడు. కానీ చివరకు అది కాస్త ఫెయిలయిందంటే అతడి బాధ వర్ణనాతీతం.

తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ గాథ అందరిలో ఆశ్చర్యం కలిగించింది. ఈటాలోని జైతారా గ్రామానికి చెందిన ఓ యువకుడు ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత జరిగే శోభనం కోసం ఎంతో గాబరా పడ్డాడు. ఫస్ట్ నైట్ కోసం తపించిపోయాడు. దీంతో ఆ తరుణం రానే వచ్చింది. పెళ్లి తరువాత జరిగే శోభనం కావాలని దగ్గరకు తీసుకున్నాడు. ఆమె నిరాకరించడంతో పెళ్లి గోలలో అలసిపోయి ఉండొచ్చని భావించాడు. మరునాడు మళ్లీ ఆమెతో శోభనం చేసుకుందామని ప్రయత్నించగా నిరాకరించింది.
దీంతో అనుమానం వచ్చిన అతడు ఆమెను నిలదీశాడు. ఆమె అసలు విషయం చెప్పింది. తానొక ట్రాన్స్ జెండర్ అని తల్లిదండ్రులు ఈ విషయం దాచి వివాహం జరిపించారని విషయం బయటపెట్టింది. ఆశ్చర్యపోయిన పెళ్లికొడుకు ఆమెను తన పుట్టింటికి పంపించాడు వధువు తల్లిదండ్రులు వచ్చి కట్నం డబ్బు, నగలు తీసుకుపోయారు. పెళ్లికి తాను పెట్టిన ఖర్చులు ఇవ్వాలని వరుడు ప్రశ్నించగా ఆమె కుటుంబీకులు వారిపై దాడి చేశారు. దీంతో వరుడి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇలాంటి ఘటనలు ఇదివరకు జరిగాయి. అయినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఏదో మ్యారేజ్ బ్యూరోలను నమ్ముతూ ఘనంగా పెళ్లి చేసుకుంటున్నారు. తీరా ఆరా తీస్తే అసలు విషయం తెలియడంతో కంగారు పడుతున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ ఘటనలో వరుడికి డబ్బు పెద్ద మొత్తంలోనే ఖర్చయింది. పెళ్లి తంతుకు ఎంతో మొత్తం ఖర్చు పెట్టినా చివరకు మిగిలేది శూన్యమే. ఎన్నో ఊహలతో కలలు కన్న అతడి కల్లలయ్యాయి. నష్టం మాత్రం జరిగింది.