Anupama Parameswaran- DJ Tillu 2: బ్లాక్ బస్టర్ డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. అయితే అనుపమ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తుంది. చేసేది లేక ఆమె స్థానంలో మరో హీరోయిన్ ని తీసుకున్నారు. ఈ ఏడాది విడుదలైన డీజే టిల్లు సంచలన విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ వసూళ్లు రాబట్టింది. డీజే టిల్లు యూత్ కి పిచ్చగా నచ్చేసింది.
కథ లేకుండా దర్శకుడు విమల్ కృష్ణ రెండు గంటల పాటు చిన్న పాయింట్ చుట్టూ ఎంటర్టైనింగ్ గా నడిపారు. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎనర్జీ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఆయన డైలాగ్స్, టైమింగ్ కామెడీ, యాటిట్యూడ్ కొత్తగా అనిపించాయి. హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్ సైతం మూవీకి ప్లస్ అయ్యింది. మొత్తంగా డీజే టిల్లు నిర్మాతలకు, బయ్యర్లకు కాసులు కురిపించింది.
ఈ క్రమంలో సీక్వెల్ ప్రకటించారు. డీజే టిల్లు స్క్వేర్ టైటిల్ గా నిర్ణయించారు. టీంలో కూడా మార్పులు చేశారు. దర్శకుడు విమల్ కృష్ణను తొలగించారు. ఆయన స్థానంలో మాలిక్ రామ్ తీసుకున్నారు. నేహా శెట్టికి సైతం హ్యాండ్ ఇచ్చారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా ప్రకటించారు. కాగా చిత్రీకరణ దశలో ఉన్న డీజే టిల్లు స్క్వేర్ చిత్రం నుండి అనుపమ వెళ్లిపోయారట. ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట. అనుపమ నిర్ణయానికి కారణం అభిప్రాయ బేధాలని తెలుస్తుంది. దీంతో అనుమప స్థానంలో మడోనా సెబాస్టియన్ ని తీసుకున్నారట.
కాగా డీజే టిల్లు స్క్వేర్ చిత్ర హీరోయిన్ గా మొదట శ్రీలీలను అనుకున్నారు. సైన్ చేసిన శ్రీలీల తర్వాత సినిమా చేయనని వెళ్లిపోయారట. ఆమె స్థానంలో అనుపమను తీసుకుంటే ఈమె కూడా ప్రాజెక్ట్ నుండి వాల్ అవుట్ అయ్యారు. దీంతో సిద్ధు హీరోయిన్స్ ని ఎలా డీల్ చేస్తున్నాడనే సందేహాలు మొదలయ్యాయి. డీజే టిల్లు మూవీలో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి. సీక్వెల్ లో ఆ తరహా సీన్స్ కంటిన్యూ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఎలాంటి ఫేమ్ లేని నేహా శెట్టి అభ్యంతరం లేకుండా నటించింది. శ్రీలీల, అనుపమ లాంటి హీరోయిన్స్ కంగారు పడి వెళ్ళిపోతున్నారేమో అనిపిస్తుంది. మరి మూడో హీరోయిన్ అయినా నిలబడుతుందో పరిగెడుతుందో చూడాలి. సిద్ధు డీజే టిల్లు సిరీస్ కి రైటర్ కూడాను.