UP Husband And Wife: భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. వారి మధ్య ఎన్నో గొడవలు వస్తుంటాయి. అవన్నీ కాలంతో పాటు కాలగర్భంలో కలిసిపోతుంటాయి. కానీ కొందరు మాత్రం కట్టుకున్న భార్య కోసం ఎంతో తపిస్తుంటారు. చిన్న చిన్న గొడవలకే పెద్ద రాద్ధాంతాలు చేసే వారు కూడా ఉంటారు. ఆలుమగల మధ్య వచ్చే గొడవలు పొద్దున్నే వచ్చే సాయంత్రం పోయే వాటిలా ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ భార్య భర్త మీద తెగ కోపం పెంచుకుంది. అతడి నాలుకనే కొరికేసింది. దీంతో వివాదాస్పదంగా మారింది.

ఉత్తర ప్రదేశ్ లోని లఖ్ నపూలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే భర్తతో గొడవ కారణంగా భార్య సల్మా పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. ఎంతకు కాపురానికి రానని తెగేసి చెప్పింది. అయినా భర్త తన భార్య కాపురానికి రావాలని పట్టుబట్టాడు. పిల్లల భవిష్యత్ కోసమైనా ఇద్దరం కలిసి ఉండాలని కోరాడు కానీ ఆమె తిరస్కరించింది. తాను ఇక నీతో ఉండలేనని కరాకండిగా చెప్పింది. అయినా అతడిలో ఆశ చావలేదు. మాటిమాటికి కాపురానికి రావాలని విసిగించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆమె అతడి నాలుకను కొరికేసింది.
ఆమె మున్నాపై చేసిన దాడిలో నాలుక తెగిపడింది. దీంతో రక్తస్రావం జరిగింది. అతడిని ఆస్పత్రికి తరలించారు. సల్మాపై కేసు నమోదు చేశారు. మున్నా నాలుక తెగిపడటం సంచలనం కలిగించింది. కట్టుకున్న భర్తపైనే దాడికి తెగబడటం చర్చనీయాంశంగా మారింది. సంసారం చేద్దామని అడిగినందుకు భర్తపైనే దాడికి పాల్పడిన సల్మాపై పలువురు తిట్ల దండకం అందుకుంటున్నారు. ఏదో సంసారానికి రమ్మంటే రానని చెప్పి దూరంగా ఉంటే సరిపోయేది కదా. అతడి నాలుకను కొరకడంతో ఇప్పుడు పాపం ఎలా మాట్లాడతాడని అందరు ప్రశ్నిస్తున్నారు.

యూపీలో దారుణాలు జరగడం మామూలే. కోపోద్రిక్తులైతే వారు ఏం చేస్తారో కూడా వారికే తెలియదు. ఇలా కట్టుకున్న భర్తపైనే దాడికి పాల్పడి అతడి నాలుకను కొరకడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు ఎలా సంసారం చేస్తారని అడుగుతున్నారు. అనారికంగా ప్రవర్తించిన భార్య సల్మాపై విమర్శలు వస్తున్నాయి. భర్తతో కలకాలం కాపురం చేయాల్సిన ఆమె అతడిపై దాడికి తెగబడటం ఆందోళన కలిగించింది. ఇలాంటి ఘటనలు ఇంకా కొందరికి మార్గంగా మారే సూచనలు సూచిస్తాయని చెబుతున్నారు.