Tarakaratna Health Report: నిన్న కుప్పం లో జరిగిన లోకేష్ పాదయాత్ర కార్యక్రమం లో హాజరైన నందమూరి తారకరత్న అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో క్రింద పడిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..అక్కడకి వచ్చిన వచ్చిన అభిమానుల తాకిడి కారణంగా శరీరం మొత్తం డీహైడ్రేషన్ కి గురి అయ్యి గుండెపోటు వచ్చి క్రింద పడిపోయాడు..ఆయనని వెంటనే కుప్పం సమీపం లో ఉన్న ప్రైవేట్ హాసిపిటల్ కి తరలించి అత్యవసర చికిత్స అందించారు..హాస్పిటల్ కి తీసుకెళ్లేలోపు అతని పల్స్ ఆగిపోయింది..వెంటనే డాక్టర్లు CPR చేసి పల్స్ తిరిగి తప్పించారు..ఆ తర్వాత అతనికి చికిత్స అందిస్తూ ఉండగా ప్రాణాపాయం ఏమి లేదని న్యూస్ ని డాక్టర్లు చెప్పారు..కానీ లేటెస్ట్ గా విడుదల చేసిన బులిటెన్ లో తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత క్రిటికల్ గా ఉందని తెలుస్తుంది.

ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్స్ నుండి ఒక అధికారిక పత్రిక ప్రకటన విడుదల అయ్యింది..తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమం గా మారడం తో ఆయనని టెరిటరీ సెంటర్ కి తరలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు..ఆయన ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు కార్డియాలజీ స్పెషలిస్ట్స్ ని పిలిపిస్తున్నామని, ఆయన ప్రాణాలను కాపాడడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా డాక్టర్లు తెలిపారు.

ఈ వార్త రావడం తో నందమూరి అభిమానులు ఒక్కసారిగా శోకసంద్రం లో మునిగిపోయారు..ఎలా అయినా తారకరత్న సంపూర్ణ ఆరోగ్యంతో మా ముందుకి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు..నందమూరి కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ కి చేరుకున్నారు..ప్రస్తుతం ఆందోళనకరమైన వాతారవరణం మధ్యనే అందరూ ఉన్నారు.