
Agent Trailer: అక్కినేని అఖిల్ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రం గా తెరకెక్కిన ‘ఏజెంట్’ చిత్రం ఎట్టకేలకు ఎన్నో అడ్డంకులను దాటుకొని ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని నిన్న విడుదల చేసింది మూవీ టీం. కాకినాడ లో ప్రత్యేకంగా ఒక వేదిక ని ఏర్పాటు చేసి అభిమానుల సమక్షం లో ఈ ట్రైలర్ ని విడుదల చేసారు.
రెస్పాన్స్ అదిరిపోయింది, ఆలస్యం అయినా కూడా అద్భుతమైన ఔట్పుట్ ని అందించబోతున్నారనే సంకేతం ఈ ట్రైలర్ ఫ్యాన్స్ కి మరియు ఆడియన్స్ కి అర్థం అయ్యేలా చేసింది. కెరీర్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి అఖిల్ కి ఇండస్ట్రీ లో సరైన సూపర్ హిట్ ఒక్కటి కూడా లేదు. అందుకే ఈ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే కసితో ఎంతో కస్టపడి చేసాడు.

ఇక ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం 18 గంటల్లోనే ట్రైలర్ కి 8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఎలాంటి యాడ్ ప్రొమోషన్స్ లేకుండా ఈ రేంజ్ వ్యూస్ ఒక మీడియం రేంజ్ హీరో కి రావడం ఇది వరకు ఎప్పుడూ కూడా జరగలేదు, అలాంటిది ఈ సినిమాకి జరిగిందంటే జనాల్లో ఈ మూవీ పై ఉన్న అంచనాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు
షూటింగ్ ఆలస్యం అవుతూ అంచనాలు మొత్తం పోయాయి అనుకుంటున్న సమయం లో ఈ ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ ని చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు అఖిల్ నుండి ఎలాంటి హిట్ ని అయితే కోరుకున్నామో అలాంటి హిట్ పడబో