Vijay Deverakonda Rashmika Wedding Udaipur: ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో చెప్పడం కష్టం…ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న నటీ నటుల మధ్య ప్రేమ చిగురించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు సినిమాల్లో కలిసి నటించిన కొంతమంది నటీ నటుల మధ్య అనుకోకుండా ఏర్పడిన స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు…ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందానలు సైతం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఒకట్టవ్వబోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. ఇక ఎట్టకేలకు ఈరోజు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వాళ్ళ పెళ్లి జరుగుతున్న సందర్భంగా కొంతమంది సినిమా సెలబ్రిటీల సైతం ఆ పెళ్లి హాజరవ్వబోతున్నారు. ఇక పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే విధించారు. పెళ్లికి వచ్చిన అతిధులందరిని ఒకే రూమ్ లో ఉంచి వాళ్ల దగ్గర నుంచి ఫోన్లు మొత్తం లాక్కున్నారట. బిగ్ బాస్ హౌస్ లో ఎలాగైతే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయో వీళ్ళ పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాంటి రూల్స్ పెడుతున్నారట. వాళ్ళ పెళ్లి కి సంబంధించిన ఏ ఒక్క ఫోటో గాని వీడియో గాని బయట లీక్ అవ్వకుండా ఉండడానికే ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్టుగా తెలుస్తుంది.
Also Read: శ్రీలంక జట్టు ఇంటికి వెళ్లడం ఖాయమైంది.. వెళ్తూ వెళ్తూ పాకిస్థాన్‌ను కూడా తోడు తీసుకెళ్తుందా?
ఒక్క ఫోటో లీకైన కూడా వాళ్ళ పెళ్లికి సంబంధించిన విషయాలన్నీ బయట తెలిసిపోతాయనే ఉద్దేశ్యంతోనే వాళ్ళిద్దరు ఉన్నారట. నిజానికి పెళ్లి అనేది అందరి సమక్షంలో చేసుకోవాలి. కానీ వీళ్ళు ఏంటి ఇంత రహస్యంగా చేసుకుంటున్నారు అంటూ కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. నిజానికి రష్మిక గాని, విజయ్ దేవరకొండ గాని ఎక్కడ కూడా తము పెళ్ళి చేసుకోబోతున్నాం అంటు బహిరంగంగా మాట్లాడలేదు.
పోస్ట్ ల ద్వారా పెళ్లి చేసుకోబోతున్నాం అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు గాని ఎక్కడ కూడా ఇద్దరు కనిపించి తమ పెళ్లి ముహూర్తాన్ని గాని పెళ్లి చేసుకుంటున్నామని గాని ఎక్కడ మాట్లాడలేదు. దానివల్ల కొంతమంది ఈరోజు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారని చెప్పినా కూడా నమ్మడం లేదు.
ఇక ఏది ఏమైనా కూడా మార్చి 4 వ తేదీన జరగబోయే రిసెప్షన్ సమయంలో రాజకీయ, సినిమా సెలబ్రిటిలందరిని వాళ్ళ రిసెప్షన్ కి పిలువబోతున్నారు. కాబట్టి ఆరోజు వాళ్ళ రిసెప్షన్ మొత్తాన్ని లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ పెళ్లికి వచ్చిన అతిథులను ఒక రూమ్ లో పెట్టి ఫోన్ లు లాక్కొని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…