
Parijata Plant : మన ఇంటికి వాస్తు పద్ధతులు సక్రమంగా ఉండాలి. లేదంటే ఇబ్బందులు రావడం సహజం. వాస్తు శాస్త్రం మన ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్టు ఎటు వైపు నాటాలో కూడా తెలుసుకోవాలి. లేదంటే సమస్యలు వస్తాయి. సమస్యల్లో చిక్కుకుంటే ఇక బయట పడటం కష్టమవుతుంది. అందుకే ముందే తెలుసుకుంటే మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం చెట్లు ఎటు వైపు ఉండాలి? మొక్కలు ఎటు వైపు నాటితే మంచి ఫలితాలు వస్తాయనే విషయంలో స్పష్టత ఉండాలి. అప్పుడే మనకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాం. ఈ నేపథ్యంలో మొక్కలు ఎలా పెంచాలనే దానిపై తెలుసుకుందాం.
ప్రతి వ్యక్తి తన సొంతింటి కల నెరవేర్చుకోవాలని చూస్తాడు. ఎన్ని డబ్బులు ఖర్చయినా ఫర్వాలేదు. తన కుటుంబం సొంత ఇంట్లో నివసించాలని కోరుకోవడంలో తప్పు లేదు. ప్రతి వాడి జీవిత లక్ష్యం సొంతింటి నిర్మాణం. అయితే ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం చేసుకోవాలి. అన్ని పద్ధతులు పాటించి ఇంటి నిర్మాణం చేసుకుంటే మనకు సమస్యలు ఎదురుకావు. అంతేకాని వాస్తు పద్ధతులు పాటించకుండా ఇల్లు కడితే మనం జీవితంలో సమస్యల్లో ఇరుక్కోవడం ఖాయం.

ఈ నేపథ్యంలో మన ఇంటికి పూల మొక్కలు ఏ దిక్కున ఉంచుకోవాలి. ఎలాంటి మొక్కలు ఇంటి ఆవరణలో పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకుంటే మంచిది. ఇంటి ఆవరణలో మొక్కల పెంపకం గురించి శ్రద్ధ తీసుకోవాలి. పూల మొక్కల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే.
ఇంటి ఆవరణలో పారిజాత మొక్క ఉంటే మనకు ఎన్నో లాభాలున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా సువాసన ఉంటుంది. దాని పూలు కూడా అందంగా ఉంటాయి. ఈ మొక్క ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుందని చెబుతారు. దీన్ని ఉత్తరం, తూర్పు, ఈశాన్యం మూలల్లో ఎక్కడైనా నాటుకుంటే మంచిది. దీంతో మన దారిద్ర్యం పోతుంది. మంచి లాభాలు వస్తాయి. ఈ విషయాలు తెలుసుకుని ఈ మొక్కను ఇంటి ఆవరణలో నాటుకోవడం వల్ల మనం జీవితంలో ఎదుగుతామని తెలుసుకోవాలి.