Suriya Vanangaan: తెలుగునాట అశేష ప్రజాధారణ పొందిన అతి తక్కువమంది హీరోలలో సూర్య ఒకరు..సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత తెలుగు లో అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఆయన..చాలా సినిమాలు ఆయనవి తమిళ్ లో ఫ్లాప్ అయినవి కూడా తెలుగు లో సూపర్ హిట్స్ గా నిలిచాయి..ఉదాహరణకి 7th సెన్స్ మరియు 24 అనే సినిమాలు తమిళం లో కమర్షియల్ గా ఫ్లాప్ గా నిలిచింది..కానీ తెలుగు లో ఈ రెండు సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

సూర్య ని ఇక్కడి జనాలు అంతలా ఆదరిస్తారు..అయితే ఇప్పుడు ఆయన వరుసగా ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు..చాలా కాలం నుండి అతనికి సరైన బ్లాక్ బస్టర్ లేదు..ఆయనకీ జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆకాశం నీ హద్దురా’ అనే చిత్రం కూడా నేరుగా OTT లో విడుదలైంది..ఇక చాలా కాలం తర్వాత థియేటర్స్ లోకి ఈ ఏడాది విడుదలైన ‘ET’ అనే చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ గా నిలిచింది.
ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ మొత్తం తమ తదుపరి చిత్రాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు..ప్రస్తుతం ఆయన తమిళ డైరెక్టర్ బాల తో ‘వనన్ గాన్’ అనే సినిమా మరియు వెట్రిమారన్ తో ‘వాడివాసల్’ అనే సినిమాలు చేస్తున్నాడు..ఈ రెండు సినిమాలు సగానికి పైగా షూటింగ్స్ ని పూర్తి చేసుకున్నాయి..అయితే వీటిల్లో బాల తో చేస్తున్న ‘వనన్ గాన్’ అనే సినిమా మధ్యలోనే ఆగిపోయినట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది..సినిమా ఔట్పుట్ విషయం లో సూర్య సంతృప్తి గా లేదు..ఎలాంటి వివాదాలు లేకుండా..డైరెక్టర్ బాల మరియు సూర్య ఇద్దరూ చర్చించుకునే ఈ సినిమాని ఆపేసినట్టు తెలుస్తుంది.

ఇక బాల కూడా త్వరలోనే ఒక కొత్త హీరో తో సినిమా చెయ్యబోతున్నట్టు చెప్పుకొచ్చాడు..గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో నంద మరియు శివ పుత్రుడు వంటి సినిమాలు వచ్చాయి..సూర్య శివ పుత్రుడు సినిమా ద్వారానే మన తెలుగు తెరకి పరిచయం అయ్యాడు..ఈ సినిమా సూర్య కెరీర్ ని ఒక మలుపు తిప్పింది.