spot_img
Homeఎంటర్టైన్మెంట్Hero Nani: హీరో నాని ని సెట్స్ లో బూతులు తిట్టిన స్టార్ డైరెక్టర్..నాని ఎమోషనల్...

Hero Nani: హీరో నాని ని సెట్స్ లో బూతులు తిట్టిన స్టార్ డైరెక్టర్..నాని ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Hero Nani
Hero Nani

Hero Nani: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి స్టార్స్ అవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు.కెరీర్ ప్రారంభం లో ఎన్నో అవమానాలను ఎదురుకోవాల్సి వస్తుంది. అడ్డమైన వాళ్ళందరి చేత మాటలు అనిపించుకోవాల్సి వస్తాది. బానిసలు లాగ ట్రీట్ చేస్తారు,అలా ఎన్నో అవమానాలను ఎదుర్కొని వచ్చిన హీరో మన న్యాచురల్ స్టార్ నాని. ఎలాంటి అండదండా లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజి ని ఏర్పాటు చేసుకున్నాడు నాని.

ఇప్పుడు ఆయన సినిమా వస్తుంది అంటే చాలు, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేస్తారు.హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈ స్థాయి ఆయనకీ ఊరికే రాలేదు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘దసరా’ ఈ నెల 30 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ లో కెరీర్ తొలినాళ్లలో ఎదురుకున్న అవమానాల గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Hero Nani
Hero Nani

ఆయన మాట్లాడుతూ ‘ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చిన వారికి అవమానాలు అనేది సర్వసాధారణం.నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఎన్నో అవమానాలు ఎదురుకున్నాను. క్లాప్ బోర్డు ఆలస్యం అయినా కూడా అందరి ముందుకు నోటికి వచ్చినట్టు అరిచేవాళ్ళు.అవన్నీ నేను ముందుగానే ప్రిపేర్ అయ్యి భరించాను, కానీ ఒక ప్రముఖ దర్శకుడు మాత్రం నన్ను షూటింగ్ స్పాట్ లో చాలా దారుణంగా అవమానించాడు. అది నేను నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను. నేను దేనికీ పనికిరాని అన్నాడు, ఈ జన్మలో డైరెక్షన్ చెయ్యలేను అన్నాడు. ఆ మాటలు నన్ను ఎంతో మనోవేదనకు గురి చేసాయి,ఇప్పటికిప్పుడు నా సక్సెస్ ని చూపించి అతనికి దిమ్మ తిరిగే సమాధానం చెప్పాలని ఉంది. కానీ సంస్కారం అడ్డొస్తుంది, ఈమధ్యనే అతనిని కలిసాను కూడా, కానీ మా మధ్య ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇప్పటికీ లేదు’ అంటూ నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...
Oktelugu Epaper
Exit mobile version