Hero Nani: హీరో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) స్వభావం చాలా మిత భాషి అట. ఇది ఎవరైనా నమ్ముతారా చెప్పండి?, కానీ నిజంగా తానూ మిత భాషి ని అంటూ రీసెంట్ గా జరిగిన ‘జయమ్మ నిశ్చయమ్మురా’ అనే ప్రోగ్రాం లో చెప్పుకొచ్చాడు. జగపతి బాబు హోస్టింగ్ చేస్తున్న ఈ టాక్ రీసెంట్ గానే మొదలై మంచి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా జీ 5 యాప్ లో ఈ టాక్ షో కి అత్యధిక వ్యూయర్ షిప్ లభించింది. తన మనసుకి బాగా దగ్గరైన వాళ్లనే జగపతి బాబు పిలుస్తూ ఉంటాడు. నాని తో మొదటి నుండి జగపతి బాబు కి మంచి వైబ్ ఉంది కాబట్టి ఆయనతో జరిపిన ఈ మూడవ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. ఎక్కడా కూడా ఎమోషనల్ కనెక్షన్ లేకుండా, ఇద్దరు స్నేహితులు కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉండింది.
Also Read: తండ్రి కారణంగా రోడ్డు మీదకు వచ్చిన హీరో నాని ఫ్యామిలీ..మరీ ఇంత దారుణమా!
అయితే ఈ ఇంటర్వ్యూ లో జగపతి బాబు అడిగిన అనేక ప్రశ్నల్లో ఒకటి ‘అర్థరాత్రి అయినా ఏదైనా సహాయం కావాలంటే మొట్టమొదట మెసేజ్ చేయగలిగేంత బెస్ట్ ఫ్రెండ్స్ నీకు సినీ ఇండస్ట్రీ లో ఎవరున్నారు?’ అని అడుగుతాడు. దానికి నాని సమాధానం చెప్తూ ‘రానా దగ్గుబాటి, ఆది పిన్ని శెట్టి, నీరజ కోన’ అని సమాధానం ఇస్తాడు. నాని కి రానా బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అనేక సార్లు ఈ విషయం చెప్పుకొచ్చారు. కానీ ఆది పినిశెట్టి కూడా నాని కి ఇంతటి దగ్గర స్నేహితుడు అనే విషయం మాత్రం ఈ ఎపిసోడ్ ద్వారానే తెలిసింది. వీళ్లిద్దరు కలిసి ‘నిన్ను కోరి’ అనే సూపర్ హిట్ చిత్రం లో నటించారు. కలిసి నటించినంత మాత్రానా అంత క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా మంది హాయ్ , బాయ్ అనే టైపు లోనే ఉంటారు. కానీ ఒకే ఒక్క సినిమాతో వాళ్ళ మధ్య అంతటి బాండింగ్ ఏర్పడింది అంటే షూటింగ్ సమయం లో వాళ్లకు ఎదురైనా పరిస్థితులు ఏంటో అని మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్.
ఇక నీరజ కోన గురించి మన అందరికీ తెలిసిందే. ఈమె పంజా చిత్రానికి నిర్మాత. ఈంతో కలిసి నాని ఇప్పటి వరకు ఒక్క సినిమాకు కూడా పని చెయ్యలేదు, అయినప్పటికీ వీళ్ళ మధ్య ఇంతటి బాండింగ్ ఏర్పడడానికి కారణం ఏంటి సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హీరో నాని ఈ షో లో పంచుకున్నాడు. జీ 5 యాప్ లో ఈ ఎపిసోడ్ అందుబాటులో ఉంది.