Bangles: మహిళలు గాజులు ధరించడం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఇదే…!

ఆడవాళ్లు గాజులను అందానికి మాత్రమే ధరిస్తారనుకోవడం పొరపాటని చెప్పుకోవచ్చు. మహిళలు గాజులు ధరించడం వలనే చాలా ప్రయోజాలను పొందుతారట. అంతేకాదు మహిళలు ఈ విధంగా గాజులు ధరించడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందంట. అదేంటి? అనేది మనం తెలుసుకుందాం.

Written By: Suresh, Updated On : December 28, 2023 2:55 pm

Bangles

Follow us on

Bangles: సాధారణంగా దాదాపు మహిళలు అందరూ గాజులను ధరిస్తారన్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా హిందూ స్త్రీలు గాజులను ధరించడం అనేది సంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. స్త్రీలు గాజులు ధరించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారమని చెప్పుకోవచ్చు. ఇంతకు పూర్వం కూడా బంగారం, వెండి, ప్లాస్టిక్, గాజువంటి లోహాలతో తయారు చేసిన గాజులను ధరించేవారు.

ఆడవాళ్లు గాజులను అందానికి మాత్రమే ధరిస్తారనుకోవడం పొరపాటని చెప్పుకోవచ్చు. మహిళలు గాజులు ధరించడం వలనే చాలా ప్రయోజాలను పొందుతారట. అంతేకాదు మహిళలు ఈ విధంగా గాజులు ధరించడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందంట. అదేంటి? అనేది మనం తెలుసుకుందాం.

మహిళలు చేతులకు గాజులను ధరించడం వలన మణికట్టు ప్రాంతంలో రక్త ప్రసరణ పెరుగుతుందని సైంటిఫిక్ గా వెల్లడైంది. ఈ క్రమంలో మణికట్టు దగ్గర గాజుల రాపిడికి రక్త ప్రసరణ వేగం పెరుగుతుంది. దీని వలన సదరు మహిళలు ఆరోగ్యంగా ఉంటారని పెద్దలు చెబుతుంటారు. గాజులు వెనక్కి ముందుకు కదలడం వలన రక్తనాళాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని అలసట, ఒత్తిడి తగ్గడంతో పాటు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే మట్టి గాజులను వేసుకోవడం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు రెండు చేతులకు గాజులను ధరించాలి. ఎక్కువగా గాజులను ధరించడం వలన వాటి శబ్దం కడుపులోని బిడ్డకు ఊరటనిస్తుంది. అలాగే గాజులు వేసుకోవడం వలన హార్మోన్ల అసమతౌల్యత సమస్య తొలగుతుందని సైంటిఫిక్ గా వెల్లడైందని తెలుస్తోంది.

గాజుల్లో రెండు రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. అవి ఎరుపు మరియు ఆకుపచ్చ. దక్షిణ భారత రాష్ట్రాల్లోని స్త్రీలు ఎక్కువగా ఆకుపచ్చ రంగు గాజులను ధరిస్తారు. ఆకుపచ్చ రంగు ఆధ్యాత్మికతతో పాటు శాంతిని సూచిస్తుంది. అలాగే పంజాబ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎరుపు రంగు గాజులను ఎక్కువగా ధరిస్తారు. ఎరుపు రంగుకు చెడును నాశనం చేసే శక్తి ఉందని మహిళలు విశ్వసిస్తారు. శుభాకార్యాలకు సైతం ఎక్కువగా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగు గాజులనే వినియోగిస్తారు. గ్లాస్ గాజులు ధరించే వారు భావోద్వేగానికి గురవుతారని తెలుస్తోంది.