https://oktelugu.com/

Cyber ​​Fraud: ఈ తరహా వాట్సాప్ మెసేజ్ లను అస్సలు నమ్మొద్దు

ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో ఊహించలేం. సడెన్‌గా మన ఫోన్‌కు ఓ మెసేజ్‌ పంపతారు. దాంతోపాటు ఓ లింగ్‌ లేదా ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మనకు ఫోన్‌ వస్తుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 28, 2023 / 02:59 PM IST

    Cyber ​​Fraud

    Follow us on

    Cyber ​​Fraud: ప్రస్తుతం సైబర్‌ మోసాల కాలం నడుస్తోంది. ఒకప్పుడు దొంగతనాలు అంటే.. బందిపోటులు ఉండేవారు. తర్వాత దొంగలు కాస్త అప్డేట్‌ అయ్యారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేశారు. తర్వాత చైన్‌స్నాచింగ్‌కు తెగించారు. చెడ్డీ గ్యాంచ్, ఆయిల్‌ గ్యాంగ్, నిక్కర్‌ గ్యాంగ్‌ పేర్లతో దోపిడీలు చేశారు. తర్వాత ఏటీఎంలు కార్డులు మార్చి డబ్బులు అపహరించారు. ఇప్పటికీ ఇలాంటి చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి తోడు నేడు ఏమాత్రం శ్రమ లేకుండా మన ఖాతాలోని సొత్తును చోరీ చేస్తున్నారు. ఇదే సైబర్‌ మోసం. మనం ఏమరుపాటుగా ఉన్న మసయంలో ఓటీపీలు తెలుసుకుని, ఫింగర్‌ ప్రింట్‌ స్కాన్‌ చేసి అకౌంట్‌ లూటీ చేస్తున్నారు. తాజాగా మరో కొత్తరకం సైబర్‌ మోసానికి తెరతీశారు ముసుగు దొంగలు.

    రోగులే లక్ష్యంగా..
    ఎక్కడ ఉంటారో తెలియదు.. ఎలా ఉంటారో ఊహించలేం. సడెన్‌గా మన ఫోన్‌కు ఓ మెసేజ్‌ పంపతారు. దాంతోపాటు ఓ లింగ్‌ లేదా ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాగానే మనకు ఫోన్‌ వస్తుంది. వెంటనే ఓటీపీ చెప్పండి అని అగుడుతారు. చెప్పగానే అకౌంట్‌లోని సొత్తు మాయమవుతుంది. ఇక లింగ్‌ ఓపెన్‌ చేయగానే మన వ్యక్తిగత వివరాలన్నీ అతడి వెళ్లిపోతాయి. వాటిసాయంతో డబ్బులు అపహరిస్తున్నారు. తాజాగా అనారోగ్యంతో బాధపడేవారే లక్ష్యంగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయి. మా వద్ద కిడ్నీలు ఉన్నాయి. హార్డ్‌ ఉంది.. మీకు అత్యవసరమని తెలిసింది. వెంటనే ఈ కింది నంబర్‌ను సంప్రదించండి అని ఆ మెసేజ్‌ సారాంశం. అవసరం ఉన్నవారు వెంటనే స్పందించి వారిని సంప్రదించి డబ్బులు సమర్పించుకుంటున్నారు.

    అవయవాలు ఉన్నట్లు ప్రచారం నేరం..
    వాస్తవానికి అవయవ దానానికి ట్రస్టులు ఉంటాయి. వాటిని మాత్రమే సంప్రదించాలి. వారు సీరియల్‌ ప్రకారం అవయవాలు సేకరించి రోగులకు అందించే ఏర్పాటు చేస్తారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొంతమంది సైబర్‌ దారిని మోసానికి మార్గంగా ఎంచుకున్నారు. ఇందులో బాధలో ఉన్నవారినే మరింత బాధపెట్టేస్తున్నారు. మెసేజ్‌లు పంపి వారి అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు. ఇలాంటి మెజేస్‌లపై చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.